Rachakonda CP on Cricket Match Security Arrangements : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి జరగబోయే భారత్- ఇంగ్లాండ్(IND VS ENG) టెస్ట్ మ్యాచ్ కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు. అతిథి జట్టు ఇంగ్లాండ్‌ను అహ్వానించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 306 సీసీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటుగా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు.
ఇంగ్లాండ్‌తో సిరీస్ - ఉప్పల్ గడ్డపై టీమ్ఇండియా రికార్డులు
IND VS ENG Test Match in Uppal Stadium :ఉప్పల్ స్టేడియం(Uppal) వద్ద 1500 పోలీసులతో పాటు ఆక్టోపస్, స్పెషల్ టీమ్స్ బందోబస్తులో పాల్గొంటాయని సీపీ సుధీర్‌బాబు స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం స్టేడియం పరిసరాల్లో 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు. మ్యాచ్ తిలకించేందుకు స్టేడియంలోకి ఉదయం ఆరున్నర గంటల నుంచి అనుమతిస్తామని, మ్యాచ్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని సీపీ వివరించారు.
స్టేడియంలోనికి ల్యాప్‌ట్యాప్స్, బ్యాగ్స్, లైటర్స్, బ్యానర్స్, హెక్నెట్స్, పవర్ బ్యాంక్స్, సిగరెట్స్, బైనాకిల్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను లోనికి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. అంతేకాకుండా బయటి ఆహారం, వాటర్ బాటిల్స్ స్టేడియం లోపలికి అనుమని లేదన్న సీపీ, ఒకసారి స్టేడియం లోపలికి వచ్చిన వాళ్లు బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వస్తే అనుమతించమని తెలిపారు.
"హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి జరగబోయే భారత్- ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిచేశాం. స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 306 సీసీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటుగా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశాం. స్టేడియం వద్ద 1500 పోలీసులతో పాటు ఆక్టోపస్, స్పెషల్ టీమ్స్ బందోబస్తులో పాల్గొంటాయని, మహిళల భద్రత కోసం స్టేడియం పరిసరాల్లో 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయి".- సుధీర్‌బాబు, రాచకొండ సీపీ
ఉప్పల్‌లో టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్తున్నారా? వీటిని పాటించాల్సిందే
IND VS ENG Test Match Special Buses : మరోవైపు క్రికెట్ మ్యాచ్ వీక్షించే అభిమానుల కోసం టీఎస్‌ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఉప్పల్‌కు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉప్పల్ మైదానంలో కొనసాగే ఈ మ్యాచ్‌కు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌కి ప్రతి రోజు 5 వేల విద్యార్థులకు ఫ్రీ టికెట్