QR Code System in Tenth Class Exams: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతుండగా భద్రతా చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎగ్జామ్ పేపర్‌కు ఒక క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల అక్రమాలకు నివారించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
పరీక్షల టైమ్‌లో పిల్లలకు ఈ ఫుడ్స్ పెడితే - జ్ఞాపక శక్తి ఓ రేంజ్లో పెరుగుతుంది !
దీంతోపాటు పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలన్నీ నో మొబైల్ జోన్లుగా ప్రకటించారు. డీఈవో సహా చీఫ్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు సైతం పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి లేదని స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే, దానికి బాధ్యులైన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని విశాఖ డీఈవో చంద్రకళ తెలిపారు.
"ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా ఎగ్జామ్ పేపర్‌కు ఒక క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నాం. దీనివల్ల అక్రమాలు నివారించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతోపాటు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతిలేదు. పరీక్షా కేంద్రాలన్నీ నో మొబైల్ జోన్లుగా ప్రకటిస్తున్నాం. డీఈవో సహా చీఫ్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు సైతం పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి లేదు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే, దానికి బాధ్యులైన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష. మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి."- చంద్రకళ, విశాఖ డీఈవో