Cement Price Hike In Telangana :తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. సిమెంట్ ధరల్ని పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని ‘ఎన్డీటీవీ ప్రాఫిట్’ పేర్కొంది. ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్, రామ్‌కో, అల్ట్రాటెక్, ఏసీసీ సహా ప్రధాన సిమెంట్ కంపెనీలు ధరలు సవరించాయి.
ఏపీ, తెలంగాణలో 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచిందని జాతీయ మీడియా పేర్కొంది. తమిళనాడులో రూ.10-20 పెంచినట్లు తెలిపింది. సవరించిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిసరుకులు, పెరుగుతున్న రవాణా ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా సిమెంట్ ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ రంగంతో పాటు మౌలిక సదుపాయాల కార్యకలాపాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. భారీ మొత్తంలో సిమెంటును వినియోగించే నిర్మాణ సంస్థలపై ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. పెరిగిపోతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటిని నిర్మాణ ఖర్చు మరింత పెరగనుంది.
సిమెంట్ బిజినెస్లో స్పీడు పెంచిన అదానీ- అంబుజా చేతికి పెన్నా సిమెంట్
మాకు నష్టాలు వస్తాయి :సిమెంటు ధరల పెరుగుదలతో కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న మధ్య తరగతి ఆశలు ఆవిరి అవుతున్నాయి. రోజురోజుకి మారుతున్న ధరలు చూసి సొంతిటి ఆశల కలగానే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడంతో వ్యాపారస్థులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా ధరలు పెరుగుతుంటే తీవ్ర నష్టాలకు గురవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఇంటి నిర్మాణంపై ముందే ఒప్పందం చేసుకున్న వారికి ఇది భారం కానుంది.
ఏమీ చేయలేని పరిస్థితి :మరోవైపు ధరల భారం పెరిగితే లోన్లు తీసుకున్న వారు పరిస్థితి మరోలా ఉంది.అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు అవుతుండడంతో మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేకపోతే అది కొత్త అప్పులకు దారితీసే అవకాశముంది. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ముగియడంతో నిర్మాణాలు వేగం పుంజుకుంటాయి. ఇప్పుడు సిమెంట్ కంపెనీల ఆకస్మిక నిర్ణయం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలనే కాదు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు కూడా షాక్ తగిలినట్లైంది.
రైలు పట్టాలపై 140 కిలోల సిమెంట్ దిమ్మెలు- తప్పిన భారీ ప్రమాదం!
పెరిగిన సిమెంట్ ధరలు.. సామాన్యులకు మరింత భారం