Praneeth Rao in Police Custody :కాల్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు శనివారం అనుమతించింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ప్రణీత్‌రావు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.
ప్రణీత్‌రావు కస్టడీకి అనుమతించాలని ఈ నెల 13న ఆయనపై న్యాయస్థానానికి సమర్పించిన రిమాండు నివేదికలో పోలీసులు పలు కీలక విషయాలు పేర్కొన్నారు. పరిశీలించిన నాంపల్లి కోర్టు పంజాగుట్ట పోలీసులకు ఏడు రోజులు పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావుపై ఆధారాలు, ప్రజా ఆస్తుల(Public Property) ధ్వంసం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు టాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి.
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు - అతని కస్టడీ పిటిషన్‌పై కోర్టులో వాదనలు!
Phone Tapping Case on Praneeth Rao :ఆయనకు అప్పగించిన పనినే కాకుండా, ఇతరుల ప్రొఫైళ్లను గోప్యంగా తయారు చేశారనే ఆరోపణలు ప్రణీత్‌రావు ఎదుర్కొంటున్నారు. రహస్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని తన పెన్‌డ్రైవుల్లో నిక్షిప్తం చేసుకున్న ప్రణీత్‌రావు, అక్రమాలు బహిర్గతం కాకుండా హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.