ETV Bharat / state

'మాకు ఫార్మాకంపెనీ వద్దు - మా బతుకులు ఏదో మేము బతుకుతాం' - LAGACHARLA VILLAGERS ON PHARMA CITY

అధికారులపై తాము దాడిచేయలేదంటున్న లగచర్ల గ్రామస్థులు - ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల తమ భూములు పోతాయని అందువల్లే పోరాటం చేస్తున్నామని వెల్లడి

Lagacharla Villagers On Pharma City
Lagacharla Villagers On Pharma City (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 10:01 PM IST

Updated : Nov 14, 2024, 10:27 PM IST

Lagacharla Villagers On Pharma City : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన కలెక్టర్‌, ఇతర రెవెన్యూ సిబ్బంది వాహనాలపై స్థానికులు దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరిగినట్లుగా అనుమానిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో లగచర్ల గ్రామస్థులు స్పందించారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఫార్మా కంపెనీ వద్దు - మా భూములే ముద్దు : 'మాకు ఫార్మా కంపెనీ వద్దు, మా భూములు కావాలి' అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామస్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ గ్రామంలోకి ఫార్మా కంపెనీ వస్తుందని ప్రచారం జరిగిందని వారు తెలిపారు. దీంతో తమ భూములను కోల్పోతామని భయం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు గ్రామల రైతుల నుంచి 1300 ఎకరాల భూములను సర్కారు తీసుకుని ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిందని వారు తెలిపారు.

అధికారులు వస్తున్నారని మాకు తెలియదు : వికారాబాద్ జిల్లా కలెక్టర్,అధికారుల బృందంతో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వస్తున్నారని తమకు తెలియదని లగచర్ల గ్రామస్థులు వెల్లడించారు. తమ గ్రామానికి చెందిన వారు ఎవరు కూడా అధికారులపై దాడి చేయలేదని వివరించారు. ఫార్మా కంపెనీ వస్తే తమకు జీవనోపాధి ఉండదని గ్రామస్థులు వెల్లడించారు.

"లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల మా భూములు పోతాయి. అందువల్లనే మేము పోరాటం చేస్తున్నాము. వాటిలోనే పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. కలెక్టర్‌ మా గ్రామానికి వస్తున్నారని మాకు తెలియదు. ఎవ్వరిపైనా మేము దాడి చేయలేదు. ఒక వేళ మాకు ఆ విషయం తెలిసి ఉంటే మేము ఆయనతో మాట్లాడేవారం. మాకు ఫార్మా వద్దు. మా బతుకులు ఏదో మేము బతుకుతున్నాం"- లగచర్ల గ్రామస్థులు

ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతుల పాదయాత్ర - ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు

కలెక్టర్​పై రాళ్లు, కర్రలతో దాడి - పోలీసుల అదుపులో 55 మంది

Last Updated : Nov 14, 2024, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.