ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్ల జోరు, ప్రచార హోరు - పిఠాపురంలో జనసైనికుల సందడి - Political Nominations in Ap 2024 - POLITICAL NOMINATIONS IN AP 2024

Political Nominations in Andhra Pradesh 2024 : సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల దాఖలు చేసుకోవడంలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. రాజకీయ నాయకులు కార్యకర్తలు, అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసే పనిలో పడ్డారు.

political_nominations_in_andhra_pradesh
political_nominations_in_andhra_pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 4:26 PM IST

Political Nominations in Andhra Pradesh 2024 : సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసుకోవడంలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. రాజకీయ నాయకులు కార్యకర్తలు, అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసే పనిలో పడ్డారు. నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్‌ 25తో నామినేషన్లకు గడువు ముగియనుంది.

Pawan kalyan Nomination in Pitapuram :పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులతో భారీ జన సందోహం నడుమ జనసేనాని ర్యాలీ కొనసాగింది. పిఠాపురంలోని పురుహూతిక దేవి అమ్మవారి ఆలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న పవన్‌ ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. సాయంత్రం ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగసభలో పవన్‌ పాల్గొంటారు.

సందడిగా నామినేషన్ల పండగ- భారీగా కార్యకర్తలు, నేతలతో ర్యాలీగా తరలుతున్న అభ్యర్థులు - Candidate Nominations

Gudivada Venigandla Ramu Nomination :కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఏలూరు రోడ్డు బొమ్మరిల్లు థియేటర్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో తెలుగుదేశం నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. వారిని లీలామహల్ సెంటర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. అధికార పార్టీ సూచనలతోనే టీడీపీ ర్యాలీని దారి మళ్లిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపణ చేశారు. అనంతరం గుడివాడ పట్టణంలో యథావిధిగా ర్యాలీ కొనసాగింది. వెనిగండ్ల రాము నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.

Political Nominations in Vijayawada : విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామమోహన్‌ కుటుంబ సభ్యులు, ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. కార్యకర్తలతో కలిసి పట్టణంలోని డివిజన్లలో పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రామమోహన్‌ సతీమణి అనురాధ 3వ డివిజన్‌లోను, తనయలు గద్దె క్రాంతి కుమార్‌ ,గద్దె రాజేష్‌ కుమార్‌ 5, 7వ డివిజన్లలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ అమలు చేయబోయే సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి కూటమి ఎమ్మెల్యే ,ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వైయస్సార్ జిల్లా కమలాపురం 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆర్ఓ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ అధికారి గణేష్ కుమార్ ఐఏఎస్​కు అందజేశారు. తిరిగి గురువారం పుత్తా చైతన్య రెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

ఈనెల 24వ తేదీన ఉదయం నామినేషన్ తను వేస్తున్నట్లు అనకాపల్లి పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటలకి అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్​సింగ్​ విచ్చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీమలో జోరుగా నామినేషన్ల పండుగ- జగన్‌ తరఫున వైఎస్‌ మనోహర్‌రెడ్డి నామినేషన్‌ - nominations across Rayalaseema

ABOUT THE AUTHOR

...view details