ETV Bharat / state

దారులన్నీ అమరావతికే! - ఏడు జాతీయ రహదారులతో అనుసంధానం - AMARAVATI ORR RING ROAD ALIGNMENT

సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు - ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌లో ఎక్కువ వంపులు వద్దని సూచన

CM Chandrababu Suggests To NHAI
CM Chandrababu Suggests To NHAI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2024, 10:14 AM IST

CM Chandrababu Suggests To NHAI : రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఎలైన్‌మెంట్‌లో ఎక్కువ వంపులు లేకుండా చూడాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఓఆర్‌ఆర్‌తో ఏడు జాతీయ రహదారుల్ని అనుసంధానించాలని సీఎం తెలిపారు. మంగళవారం జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌పై ఎన్‌హెచ్‌ఏఐ, సీఆర్‌డీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ఓఆర్‌ఆర్‌ ప్రతిపాదిత మ్యాప్‌ను అధికారులు సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు.

పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్​ - ఇక పనులు రయ్‌ రయ్‌ - NHAI on Amaravati ORR Project

ఎలైన్‌మెంట్‌కి సీఆర్‌డీఏ ఇప్పటికే జారీ చేసింది. ఇక రోడ్లు భవనాలశాఖ కూడా NOC ఇస్తే ఆ ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికారు తెలిపాయి. చివరికి అక్కడ ఖరారైతే భూసేకరణ తదితర ప్రక్రియలు ప్రారంభమౌతాయని వెల్లడించారు. ఈ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున ORRను నిర్మించనున్నారు.

ఓఆర్‌ఆర్‌తో అనుసంధానమయ్యే జాతీయ రహదారులివే...

చెన్నై-కోల్‌కతా (NH-16), గుంటూరు-అనంతపురం (NH-544డి), మచిలీపట్నం-హైదరాబాద్‌ (NH-65), కొండమోడు-పేరేచర్ల (NH-163ఇజి), ఇబ్రహీంపట్నం-జగదల్‌పుర్‌ (NH-30), విజయవాడ-ఖమ్మం-నాగ్‌పుర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల్ని (NH-163జి) ఓఆర్‌ఆర్‌తో కలపనున్నారు. అలాగే రాయలసీమ నుంచి అనంతపురం జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును అమరావతి ఓఆర్‌ఆర్‌ వరకు పొడిగించనున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో 2014-19 మధ్య అనంతపురం-అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించారు. కానీ జగన్‌ ప్రభుత్వం అమరావతిపై కక్షతో దాన్ని పూర్తిగా మార్చేసింది. కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు నుంచి మొదలయ్యే ఈ రహదారిని వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల మీదుగా తీసుకొచ్చి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా ప్రతిపాదించింది. దాన్ని ముప్పవరం నుంచి అమరావతి ఓఆర్‌ఆర్‌ వరకు పొడిగించాల్సిందేనని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ వెలుగు రేఖ, రాజధాని అమరావతి మీ ఊరుకు ఎంత దూరమంటే? - AMARAVATI OUTER RING ROAD

అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - పలు కీలక ప్రాజెక్టులకూ ఆమోదం - Central on Amaravati ORR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.