ETV Bharat / state

గుడ్డు ఒక్కటే - పిల్లలే రెండు! - నుదుట ముక్కుతో వింతైన మేక పిల్ల - TWIN CHICKS FROM ONE HEN EGG

ఒకే గుడ్డులోంచి రెండు కోడి పిల్లలు - నుదుటి భాగంలో ముక్కుతో పుట్టిన మేక పిల్ల

Twin_Chicks
Twin Chicks From one Egg (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Updated : 13 hours ago

Twin Chicks From one Hen Egg : ప్రపంచంలో ఎన్నో వింతైన ఘటనలు జరుగుతుంటాయి. అరుదుగా జరిగే ఇటువంటి వింతలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల గ్రామంలో వింతైన ఘటన చోటుచేసుకుంది. ఓ కోడి గుడ్డు పెట్టగా, అందులో నుంచి రెండు కవల కోడి పిల్లలు బయటకు వచ్చాయి.

బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన షేక్ తోఫిక్ అనే వ్యక్తి కోళ్లను పెంచుతుంటారు. అయితే ఆయన తన కోళ్లు పెట్టిన గుడ్లను పొదిగించగా, ఈ నెల 23వ తేదీన ఒకే గుడ్డులో నుంచి రెండు పిల్లలు బయటకు వచ్చాయని తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన అతను, ఆ రెండు పిల్లలను పరిశీలించగా అవి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి.

ఒక్క కోడి గుడ్డు నుంచి రెండు కోడి పిల్లలు పుట్టిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు వాటిని చూసేందుకు వస్తున్నారు. అయితే ఈ వింతైన కోడి పిల్లల గురించి సొనాల ఇన్​ఛార్జి పశు వైద్యాధికారి సుశీల్ కుమార్​ను సంప్రదించగా, జన్యుపరమైన లోపాలతో ఇలా పుడతాయని అన్నారు. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు సైతం కోడికి కవలలు పుట్టాయి అంటూ ఈ వింత సంఘటనను పలువురికి చెప్తున్నారు.

తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో వింతైన మేక పిల్ల : మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఓ వింతైన సంఘటన వెలుగు చూసింది. ఈ నెల 22వ తేదీన ఓ వింత మేక పిల్ల జన్మించింది. జిల్లాలోని ఎడపల్లి మండలంలోని మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన రామరాజు అనే వ్యక్తికి చెందిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒక మేక పిల్ల తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో వింతగా కనిపిస్తోంది. దీంతో అక్కడున్న గ్రామస్థులు ఈ వింతైన మేకను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ మేక పిల్ల గురించి ఓ పశు వైద్యాధికారిని సంప్రదించగా, జన్యు లోపంతో మేక పిల్ల అలా పుట్టిందని తెలిపారు.

ఒక్క చెట్టు - ఐదు అరటి గెలలు - అనంత జిల్లాలో వింత

సమాధులు తవ్వి, మృతదేహాలపైకి నీళ్లు పంపింగ్.. కారణం ఇదేనట!

Last Updated : 13 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.