ETV Bharat / state

ఫిబ్రవరి 1 నుంచి సీపీఎం మహాసభలు - 45 ఏళ్ల తర్వాత నెల్లూరులో - CPM 27TH STATE MAHASABHALU

నెల్లూరు వేదికగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు - 45 ఏళ్ల తర్వాత మరోసారి ఆతిథ్యమిస్తున్న నెల్లూరు

cpm state mahasabhalu
cpm state mahasabhalu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 7:09 PM IST

CPM 27TH STATE MAHASABHALU: ఫిబ్రవరి ఒకటి నుంచి నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. సీపీఎం మహాసభల ప్రాంగణానికి సీతారామ్ ఏచూరి పేరును ఖరారు చేశారు. నెల్లూరు వేదికగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి పలు అంశాల మీద ఐదు యాత్రలతో ప్రజలు కదిలివస్తారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మహాసభల సన్నాహక సమావేశం నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.

45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరులో: దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సారథ్యంలో నెల్లూరులో 1978లో 13వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. 45 సంవత్సరాల తర్వాత మరోసారి సీపీఎం మహాసభలకు నెల్లూరు ఆతిథ్యమిస్తోంది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో నెల్లూరు ముందుందని శ్రీనివాసరావు అన్నారు. మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుంచి పతాక యాత్రలు కొనసాగుతున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, కడప ఉక్కు, అమరావతి రాజధాని, నంద్యాల రెన్యుబుల్ ఎనర్జీకి భూముల పందేరంపై యాత్రలు కొనసాగుతాయని అన్నారు.

మహాసభల్లో ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ సూపర్ 6తో సహా ప్రధాన అంశాలపై చర్చ జరగనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ప్రత్యామ్నాయ ప్రణాళికపై మహాసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఈ మహాసభలలో అఖిల భారత నాయకులు బీవీ రాఘవులు, ఎంఏ బేబీ, ఆర్. అరుణకుమార్​తోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారని వెల్లడించారు.

'అట్టడుగువర్గాలతో సీతారాం ఏచూరికి అనుబంధం' - సీఎం చంద్రబాబు సహా పలువురి సంతాపం - Condolences to Sitaram Yechury

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.