Wedding season start : 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి', 'కల్యాణ వైభోగమే', 'శ్రీరస్తు, శుభమస్తు' అనే పాటలు ఇక మార్మోగనున్నాయి. కొద్ది రోజులుగా బ్రేక్ పడిన కళ్యాణ ఘడియలు రానే వచ్చేశాయి. ఇక సందడే సందడి. ఈ నెల 31నుంచి ముహూర్తాలు ఉండగా వివాహాల సందడి మొదలు కాబోతోంది. ఈ ఏడాది భారీ ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నట్లు తెలుస్తోంది. శ్రీరస్తు, శుభమస్తు, కల్యాణమస్తు సందడి వచ్చేసింది. భారీ గ్యాప్ తర్వాత ఈ ఏడాది అధిక సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నుంచి ఆ సందడి కొనసాగనుంది.
'బేబమ్మ' చెప్పిందే కరెక్ట్! - 'తొందరగా ముసలోళ్లైపోతారు' - ఇదిగో రిపోర్ట్
వివాహం అనేది కేవలం ఇద్దరిని కలపడమే కాదు. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు కుదర్చడమే కాదు ఎన్నో కుటుంబాల్లో సంతోషాల్ని నింపుతుంది. దాదాపు 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు. రానున్న నాలుగు నెలల్లో సగానికి పైబడి రోజులు వివాహాలకు కల్యాణ మండపాలు ముందస్తుగా నమోదయ్యాయి. వందలాది వివాహాల నేపథ్యంలో పురోహితులకు ఈవెంట్ ఆర్గనైజర్లకు డిమాండ్ ఉంటుంది. క్యాటరింగ్, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు కళకళలాడనున్నాయి. అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌హౌస్‌లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ఎంతో డిమాండ్ ఉంటుంది.
వివాహ సుముహూర్తాలకు శుభఘడియలు ప్రారంభమయ్యాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎవరి ఏర్పాట్లలో వారు నిమగ్నమయ్యారు. దాదాపు రెండు నెలల విరామానంతరం ఎదురుచూస్తున్న పెళ్లిళ్ల సీజన్ ఇదే. ఈ సీజన్లోనే ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి. మూడుముళ్ల బంధానికి శుభ ఘడియలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాజాలు మోగనున్నాయి.
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం కావడం వల్ల మాఘాది పంచకం అంటారు. అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఫాల్గుణ మాసంలో (మార్చి 18 నుంచి 28 వరకు) శుక్ర మౌఢ్యమి రావడంతో ముహూర్తాలు ఉండవు. మళ్లీ శ్రీరామనవమి తరువాత పెళ్లిళ్ల సందడి ఎక్కువగా ఉంటుంది. నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిలోపు ఎక్కువ వివాహాలు జరిగేందుకు మంచి ముహూర్తాలున్నాయి. - పులుపుల ఫణికుమార్‌శర్మ, ప్రముఖ పురోహితుడు, గుంటూరు జిల్లా
ఆగస్టులో మొదలైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగియగా ఆ తర్వాత సింది. ఈ నేపథ్యంలో మూడున్నర నెలలుగా ఎంతగానో వేచి చూస్తున్నవారంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. తమకు అనుకూల తేదీలను ఖరారు చేసుకుని పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. వివాహాది శుభకార్యాలకు ఆగస్టు తర్వాత నవంబర్, డిసెంబర్లో కళ్యాణాలు జరిపించారు. దీపావళి పండుగ అనంతరం పెళ్లిళ్లు, గృహ ప్రవేశ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. అంతకు ముందు గత మూడు నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో ఆ సందడి తగ్గిపోగా మళ్లీ నవంబర్, డిసెంబర్లో మంచి ముహూర్తాలు వచ్చాయి. వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్ నిర్వాహకులు, ఫొట్రోగాఫర్లకు చేతినిండా పని దొరికింది.
2025 సంవత్సరంలో...
జనవరి : 31వ తేదీ, ఫిబ్రవరి మాసంలో : 2, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 20, 22, 23, మార్చి నెలలో 1, 2, 6, 7, 12, 14, 15, 16, ఏప్రిల్ నెలలో : 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23 (29, 30 వైశాఖం), మే నెలలో : 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23 (28 జ్యేష్ట మాసం)
నానబెట్టడాలు, మిక్సీ పట్టడాల్లేవ్! - 10 నిమిషాల్లో కరకరలాడే రవ్వ పునుగులు
దేశంలో రైల్వేలైన్ లేని రాష్ట్రం - అక్కడి ప్రజలు ఆదాయ పన్ను కూడా చెల్లించరట!