తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫోన్‌ బిహార్‌లో ఉందా, మీరే వెళ్లి తెచ్చుకోండి' - CEIR PORTAL FOR CELL PHONE RECOVERY

సెల్‌ఫోన్‌ రికవరీకి సీఈఐఆర్‌ పోర్టల్‌ను వాడుతున్న పోలీసులు - పక్కా సమాచారం ఉన్నా స్వాధీనం చేసుకువడంతో అనాసక్తి కనబరుస్తున్న అధికారులు

Police Are Using CEIR Portal For Cell Phone Recovery in Telangana
Police Are Using CEIR Portal For Cell Phone Recovery in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2024, 3:59 PM IST

Police Are Using CEIR Portal For Cell Phone Recovery in Telangana :సైబరాబాద్‌ కమిషనరేట్‌ శంషాబాద్‌ జోన్‌లోని ఒక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. దీంతో వారి ఫోన్‌ బిహార్‌లో ఉన్నట్లు తెలిసింది. ఫోన్‌ యజమాని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన సెల్‌ఫెన్‌ బిహార్‌లో ఉన్నట్లు సందేశం వచ్చిందని, రికవరీ చేయాలని అడగ్గా, అక్కడ ఉన్న పోలీస్‌ అధికారి మాత్రం 'మీరే బిహార్‌కి వెళ్లి తెచ్చుకోండి' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సెల్‌ఫోన్‌ ఉన్న ప్రాంతం, ఎవరు వినియోగిస్తున్నారో కచ్చితంగా తెలిసినా స్వాధీనం చేసుకోలేని పరిస్థితి.

మీ ఫోన్‌ పోయిందా..? బెంగ వద్దు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టండి గ్యారెంటీగా దొరుకుతుంది...!

అన్ని తెలిసినా స్వాధీనం చేసుకోలేని పరిస్థితి : ఇది ఒక్కరి సమస్యే మాత్రమే కాదు. ఫోన్‌ పోగొట్టుకున్న వందలాది మంది బాధితుల పరిస్థితి ఇదే. సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) వ్యవస్థ ద్వారా పొగోట్టుకున్న ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉంది, దాన్ని ఎవరు వినియోగిస్తున్నారో ఫోన్‌ నంబరుతో సహా గుర్తించినా వెంటనే దాన్ని స్వాధీనం చేసుకోలేని పరిస్థితి.

మీ ఫోన్‌ పోయిందా..? బెంగ వద్దు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టండి గ్యారెంటీగా దొరుకుతుంది...!

గతంలో ఫోన్‌ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వాటిని పోలీసులు రికవరీ చేయడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. 100 ఫిర్యాదులందితే అందులో కేవలం 20శాతం లేపే రికవరీ అయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర టెలికాం శాఖ సీఈఐఆర్‌ వ్యవసస్థను తాను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానం ద్వారా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 50 వేలకు పైగా ఫోన్లు రికవరీ అయ్యాయి. పోలీసులు మరింత స్పందిస్తే ఫోన్ల రికవరీ పెరుగుతుందని బాధితులు అంటున్నారు. హైదరాబాద్‌లో చోరీకి గురవుతున్న ఫోన్లను నేరగాళ్లు ఒడిశా, బిహార్‌, రాజస్థాన్‌,యూపీ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వీటిని అక్కడి మార్కెట్లలో తక్కువ ధరకు అమ్మేస్తుంటారు.

ఖర్చతో పాటు శ్రమతో కూడుకున్న పని : ఆ ఫోన్లను కొన్న వ్యక్తులు అందులో సిమ్‌కార్డులు వేసి వినియోగించినప్పుడు పోలీసులకు, అసలు యజమానులకు సమాచారం అందుతుంది. సిమ్‌కార్డు ఎవరి పేరు మీదుంది, ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ సమాచారం అంతా పోలీసులకు వెళుతుంది. కానీ రూ.లక్షలు ఖర్చుపెట్టి స్పెషల్‌ బృందాలను పంపించడం, ఒక్కో ఫోన్‌, ఒక్కో ప్రాంతలంలో ఉంటే అక్కడికి వెళ్లి వాటని రికవరీ చేసుకోవడం పోలీసులకు శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఒకే ప్రాంతంలో వంద లేదా అంతకుమించి ఎక్కువ ఫోన్లను గుర్తించినప్పడు ప్రత్యేక బృందాలను పంపించడం లేదా స్థానిక పోలీసులను సమన్వయం చేసుకుని ఇక్కడికి తెప్పిస్తున్నారు.

మొబైల్స్ రికవరీలో హైదరాబాద్‌ టాప్‌ - ఫోన్‌ పోయిందా ఇలా చేస్తే ఈజీగా దొరికేస్తుంది

Find My Phone by CEIR : మీ ఫోన్‌ పోయిందా.. ఇలా చేస్తే దొరికేస్తుందట..!

ABOUT THE AUTHOR

...view details