Meerpet Murder Case Updates : రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో ఈ నెల 22న వెలుగు చూసిన వెంకట మాధవి హత్య కేసు దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి నేపథ్యం, అతడి ప్రవర్తన గురించి సహోద్యోగులు, స్థానికుల్ని పోలీసులు విచారించారు. దీంతో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గురుమూర్తి నేపథ్యం అంతా సాదాసీదాగా ఉందని, కానీ ఇంత కిరాతకంగా ఎలా హత్య చేశాడన్నది అంతుబట్టడం లేదని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడిప్రవర్తనపై పోలీసుల ఆరా : నిందితుడు గురుమూర్తి డీఆర్డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. అతడి సహోద్యోగుల్ని ఆరా తీసినప్పుడు గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, మృధు స్వభావి, సాయం చేసే వ్యక్తిత్వమని కొందరు చెప్పారు. గురుమూర్తి ప్లాస్టిక్ వస్తువులు సైతం వాడడని చెప్పినట్లు తెలుస్తోంది.
అంతా సాదాసీదాగా :ఇరుగు పొరుగుతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, ఉద్యోగానికి వెళ్లొచ్చినప్పుడు మినహా ఇతర సమయం తమకు కనిపించడన్నట్లు స్థానికులు చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా, అంత జుగుప్సాకరంగా హత్య ఎందుకు చేశాడదన్నది మాత్రం మిస్టరీగా మిగిలిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. భార్య శవాన్ని ఎలాగైనా మాయం చేయాలని, తాను చంపినట్లు ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఇదంతా చేసినట్లు విశ్లేషిస్తున్నారు.