ETV Bharat / state

ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టి అమ్మిన బిల్డర్ విజయలక్ష్మి - అదుపులోకి తీసుకున్న పోలీసులు - BUILDER GURRAM VIJAYALAKSHMI

దుండిగల్ పరిధిలో బిల్డర్ గుర్రం విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టి అమ్మిన విజయలక్ష్మి

Builder Gurram Vijayalakshmi in Police Custody
Builder Gurram Vijayalakshmi in Police Custody (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 4:56 PM IST

Builder Gurram Vijayalakshmi in Police Custody : బిల్డర్‌ గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్​పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీశ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్ భావనస్ జీఎల్‌సీ క్రిబ్స్‌ యజమానురాలు విజయలక్ష్మి. ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టి అమ్మారు.

పోలీస్‌ స్టేషన్‌కు బాధితులు : గతంలో దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో గుర్రం విజయలక్ష్మిపై పలు కేసులు నమోదు అయ్యాయి. మల్లంపేట కత్వ చెరువులో సదరు నిర్మాణ సంస్థ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ క్రమంలోనే కూల్చివేసిన విల్లాలకు నష్ట పరిహారం ఇవ్వాలని, తమ గేటెడ్ కమ్యూనిటీలో వసతులు కల్పించాలని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినందుకుగాను, మున్సిపల్ కమిషనర్, చెరువులో కట్టడాలు చేపట్టినందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలో గుర్రం విజయలక్ష్మిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌ చుట్టు భారీగా తరలివచ్చారు.

అమీన్​పూర్​పై హైడ్రా కన్ను - ఆక్రమణదారుల్లో మొదలైన గుబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.