Secretariat IT department:ఏపీలో వైఎస్సార్సీపీకి ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. వైనాట్ 175 అన్న వైఎస్సార్సీపీకి ప్రజలు 11 సీట్లు కట్టబెట్టారు. ఈనేపథ్యంలో అధికారంలోకి వస్తామనుకొని వైఎస్సార్సీపీ భంగపడ్డింది. అందులో భాగంగా సచివాలయంలోని ఇన్నాళ్లు కీలకంగా మారిన ఐటీ విభాగంలో కీలక డేటా చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు సచివాలయంలో తనిఖీలు చేశారు.
సచివాలయం ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు - Police Chekings in the Secretariat
Secretariat IT department: సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యునికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్ లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేసారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ ల నుంచి డేటా తస్కరణకు, చేరిపివేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకుంది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 5, 2024, 3:12 PM IST
సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యునికేషన్ విభాగం లో ఉద్యోగుల కంప్యూటర్ లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేసారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ ల నుంచి డేటా తస్కరణకు, చేరిపివేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, డేటా హార్డ్ డ్రైవ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వర్లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడం తో తనిఖీలు చేసారని ఐటీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.