Prajavedika Program at TDP Central Office: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు తన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కబ్జా చేయాలని చూస్తున్నారని కృష్ణా జిల్లా బావులపాడు మండలం మల్లవల్లికి చెందిన సాంబశివరావు వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ నేతలు నిర్వహించిన ప్రజావేదికకు వివిధ సమస్యలతో బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫిర్యాదులు అందచేశారు. వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్ కావలి గ్రీష్మ వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి నుంచి ఫిర్యాదులు తీసుకున్న నేతలు అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. వెంటనే బాధితుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇంతమంది అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది?: పవన్ కల్యాణ్
టిడ్కో లబ్ధిదారుల జాబితా నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన పేరును అన్యాయంగా తొలగించిందని కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన మైలాపురం చక్రవర్తి ఫిర్యాదు చేశారు. అన్ని అనుమతులు తీసుకొని బోర్ వేసినా అధికారులు మాత్రం దాన్ని సీజ్ చేశారని కడప జిల్లా రామేశ్వరానికి చెందిన రవణమ్మ వాపోయారు. తన తండ్రి పేరుతో ఉన్న పొలానికి వేరొకరి పేరుతో పాసు పుస్తకాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన శ్రీనివాసాచారి వినతిపత్రం సమర్పించారు.
తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఆయన తల్లి పేరు మీదకు మార్చుకున్నారని కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వెంకటసుబ్బయ్య వాపోయారు. ప్రతి ఒక్కరి సమస్యలు గురించి విన్న నేతలు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
తిరుపతి ఘటన - ఇద్దరు అధికారులు సస్పెన్షన్ - ఎస్పీ, జేఈవో బదిలీ
తిరుపతి ఘటన వెనక కుట్రకోణం! - టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు