ETV Bharat / state

ఏపీలో వాళ్లందరికీ పింఛన్లు కట్! - మొదలైన వైద్య నిర్ధారణ పరీక్షలు - ELIMINATION OF BOGUS PENSIONS

బోగస్‌ల ఏరివేతకు సిద్ధమైన ప్రభుత్వం - రూ.15,000 పింఛన్‌ లబ్ధిదారుల్లో నాలుగో వంతు మాత్రమే అర్హులు - బయటపడుతున్న విస్తుపోయే నిజాలు

BOGUS PENSION IN AP
Government Focused On Removing ineligible Pension Holders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Government Focused On Removing ineligible Pension Holders : దీర్ఘకాలిక వ్యాధులతో పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నెలకు 15 వేల రూపాయల పింఛన్‌ అందిస్తుండగా, లబ్ధిదారుల్లో చాలామంది ఆ పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతోంది. వారి వాస్తవ పరిస్థితిని నిర్ధారించేందుకు కొద్దిరోజులుగా వైద్యులు టెస్టులు చేస్తున్నారు. అందులో కేవలం 20 నుంచి 30 శాతం మంది మాత్రమే నిజమైన అర్హులుగా తేలుతున్నారు. మరో 40 నుంచి 50% మంది వైకల్యంతో బాధ పడుతున్నప్పటికీ, వారు రూ.15000 పింఛన్‌కు అర్హులు కారని, వీరికి దివ్యాంగుల మాదిరిగా రూ.6000 పింఛన్‌కు మాత్రమే అర్హులని గుర్తిస్తున్నారు. మరో 25 నుంచి 30 శాతం మందిలో అసలు వైకల్యమే లేదని తెలింది. కొందరిలో ఉన్నా పెన్షన్ పొందేందుకు అర్హమైన స్థాయిలో లేదని బయటపడింది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సంబంధిత అధికారులు రూ.15 వేల పింఛన్‌ పొందుతున్న 655 మంది ఇళ్లకు వైద్య బృందాలను పంపారు. వారికి నిర్ధారణ పరీక్షలు చేయించగా 374 మంది మాత్రమే అర్హులని తేలింది. మరో 255 మందికి దివ్యాంగుల కోటాలో రూ.6 వేల చొప్పున ఇవ్వొచ్చని నిర్ధరించారు. మరో 26 మంది అసలు ఏ ఆరోగ్య సమస్యా లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు వెల్లడైంది. గత వైఎస్సార్సీపీ హయాంలో భారీ ఎత్తున అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.15 వేల చొప్పున పింఛన్‌ పొందుతున్న 24,091 మంది లబ్ధిదారుల ఇళ్లకు సోమవారం నుంచి వైద్య బృందాలు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతో, ఈ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

70 మందిని పరీక్షించగా, 50 మంది అనర్హులే :

  • అనంతపురం జిల్లాలో 144 మందిని పరీక్షించగా అందులో 118 మంది ‘మంచానికి పరిమితం’ అయిన స్థితిలో లేరని వెల్లడైెంది. వీరిలో చాలామంది రూ.6 వేల పింఛన్‌కు అర్హులని తేలింది.
  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 3 రోజుల పాటు 80 మందిని సర్వే చేశారు. అందులో 20% మాత్రమే అర్హులని, మరో 20 శాతం పూర్తిగా అనర్హులని గుర్తించారు. అలాగే 60శాతం మందిని దివ్యాంగుల కోటలో చేర్చవచ్చని తేల్చారు.
  • ప్రకాశం జిల్లాలో 70 మందిని పరిశీలించగా అందులో 50 మంది అనర్హులేనని నిర్ధారించారు.

వారిని కట్​ చేస్తే కోట్లలో ఆదా :

ఒక్కో లబ్ధిదారుకు రూ.15000 చొప్పున 24 వేల 91 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.36.13 కోట్లను అందిస్తోంది. అంటే ఏటా రూ.433.63 కోట్లు. అయితే మొత్తం లబ్ధిదారుల్లో సగం మంది దివ్యాంగుల కోటాకు పరిమితం కావాల్సిన వారేనని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరికి నిర్ధారణ పరీక్షల్లో కూడా అదే తేలితే, వీరికి ఇకపై ప్రతినెలా రూ.6 వేల పింఛన్‌ అందుతుంది. దీంతో నెలకు రూ.10.84 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.130 కోట్ల వరకు ప్రజాధనం ఆదా అవుతుంది.

  • 25% మంది ఏకంగా అనర్హులని అంచనా. వీరిని జాబితా నుంచి తొలగిస్తే నెలకు రూ.9 కోట్ల లెక్కన ఏడాదికి రూ.108 కోట్లు ఆదా అవుతుంది.
  • మొత్తంగా రూ.15 వేలు పింఛన్‌ పొందుతున్న వారి వాస్తవ పరిస్థితిని నిర్ధారించి అర్హులకు మాత్రమే గుర్తించి, అనర్హులకు తొలగిస్తే ఏటా రూ.238 కోట్ల ప్రజాధనం మిగులుతుంది.

వైద్యబృందాలకు విస్తుపోయే నిజాలు :

పక్షవాతం, రోడ్డు ప్రమాద బాధితులకు చేతులు, కాళ్లు పడిపోవడం, దెబ్బతినడం సహజం. మంచానికే పరిమితమైన వీరికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు పింఛన్‌ అందిస్తోంది. వీరికి రెండేళ్లకోసారి రీ-అసెస్‌మెంట్‌ చేయాలి. రాష్ట్రంలో ఇలాంటివారు దీర్ఘకాల వ్యాధి నుంచి కోలుకున్నప్పటకీ పింఛన్​ను యథావిధిగా పొందుతున్నారు. కొన్నిచోట్ల చనిపోయిన వారి పేర్లను తొలగించలేదు. 2010 నుంచి మంచానికి పరిమితమైన కేసులూ ఉన్నాయి. ఎక్కువ కాలం మంచంలోనే ఉంటే రోగుల కాళ్ల కండరాలు బలహీన పడతాయని, అదే విధంగా వీపు భాగంలో పుండ్లు పుడతాయని వైద్యులు తెలపారు. ఇలాంటి లక్షణాలను సులువుగా గుర్తించవచ్చని, వైద్యబృందాలు నిర్ధారణ పరీక్షలకు వెళ్లినప్పుడు కొందరు తమ ఇంట్లో నడుస్తూ కన్పించారని అన్నారు. పక్షవాతం, రోడ్డు, ఇతర ప్రమాద బాధితులు మందులతో కొన్నాళ్లకు సాధారణ స్థితికి వస్తారని, వీరికి రీ-అసెస్‌మెంట్‌ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

కొత్త పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం - ప్రతి నెల రూ.4వేలు

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం - ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ - Pension Distribution in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.