Woman Filed Case on Actor SriTej in Kukatpally : సినీ నటుడు శ్రీతేజ్పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ కారంచేడుకు చెందిన ఓ మహిళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసుకుని కూకట్పల్లి స్టేషన్కు ఫార్వర్డ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారంచేడుకు చెందిన ఓ 35 ఏళ్ల మహిళ మొయినాబాద్లో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి నటుడు శ్రీతేజ్కు ఆమెకు పరిచయం ఉండడంతో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను శారీరకంగా వాడుకోవడంతో పాటు తన నుంచి రూ.20 లక్షలు తీసుకుని ఇవ్వడం లేదని, తన పిల్లలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు.
గతంలోనూ కూకట్పల్లి స్టేషన్ ఓ మహిళ ఫిర్యాదు : గతంలోనూ ఏడేళ్ల కుమారుడు ఉన్న ఓ మహిళ తనను మోసం చేశాడని, భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని నటుడు శ్రీతేజ్పై కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెకు 2014లో శ్రీతేజ్ సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడని, తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మంచి మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీతేజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇవాళ కూకట్పల్లి పోలీస్స్టేషన్లో శ్రీతేజ్పై నమోదైన కేసు రెండో కేసు కావడం గమనార్హం. ఇప్పటి వరకు శ్రీతేజ్పై ఒక కేసు మాత్రమే ఉండగా, ఇప్పుడు రెండో కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.