Police Beats a Common Man in Hyderabad : సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసే కోపంతో ఓ సాధారణ వ్యక్తిపై అమానవీయంగా దాడి చేశారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ ఓ కటింగ్ షాప్ నిర్వాహకుడిపై చేయి చేసుకొని కన్నుపై రక్తం వచ్చేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
స్థానికులు, బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డుపై జీహెచ్ఎంసీ(GHMC)సిబ్బంది డ్రైనేజీ పనులు చేస్తున్నారని, మట్టి పక్కన నుంచి వెళ్లండి అని కటింగ్ షాప్ నిర్వాహకుడు సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్‌కు సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్, తనకు చెప్పేదేంటంటూ కటింగ్ షాప్ నిర్వాహకుడుపై చేయి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు పరస్పరం వాగ్వాదానికి దిగారు.