Narsingi Twin Murder Case : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ జంట హత్యల కేసులో రాహుల్, రాజ్‌కుమార్, సుఖీంద్ర అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని చంపి నిందితులు మధ్యప్రదేశ్ పారిపోయినట్లు తెలిపారు. బిందు గత కొంతాలంగా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. అంకిత్ స్నేహితుడు రాహుల్ బిందును అసభ్యకరంగా వీడియో తీయడానికి ప్రయత్నించగా వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
కోపంతోనే చంపాలని ప్లాన్ : అంకిత్, బిందుపై కోపంతో వారిని చంపాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో రాజ్‌కుమార్, సుఖేంద్ర సాయంతో అంకిత్, బిందును రాహుల్ హతమార్చినట్లు వెల్లడించారు. వీరిద్దరిని చంపిన అనంతరం నిందితులు మధ్యప్రదేశ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మధ్యప్రదేశ్‌లో ముగ్గురిని పట్టుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని సిద్ధీ జిల్లా చెందిన చెందిన అంకిత్ సాకేత్ అనే వ్యక్తి ఉపాధి కోసం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడకు వచ్చాడు. హౌస్ కీపింగ్ పనిచేస్తున్న సమయంలో అతడికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు అనే యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మారింది. అప్పటికే ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న బిందు భర్త వనస్థలిపురం పరిధిలోని చింతల్‌కుంటకు మకాం మార్చాడు.
తమ వద్దకు తీసుకురావాలని : అయినా బిందు, సాకేత్‌ల మధ్య బంధం కొనసాగింది. ఈ క్రమంలోనే బిందు తప్పుదారి పట్టింది. సాకేత్ సాయంతో కలిసి వ్యభిచారం కూడా మొదలుపెట్టింది. ఇందుకోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేది. ఈమె వ్యభిచారం చేస్తోందని తెలుసుకున్న సాకేత్ స్నేహితులు, గచ్చిబౌలిలో నివాసముండే మధ్యప్రదేశ్‌లోని సిద్ధీ జిల్లాకు చెందిన డ్రైవర్ రాహుల్ కుమార్, రాజ్‌కుమార్, సుఖేంద్రకుమార్‌లు బిందును తమ దగ్గరికి తీసుకురావాలని సాకేత్‌తో డబ్బులిస్తామని చెప్పారు.