Dengue Symptoms in Chikungunya Patients : చికున్ గన్యా వచ్చిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తుండడం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. వీరిలోనూ ప్లేట్‌లెట్లు తగ్గిపోతుండటంతో డెంగీగా అనుమానిస్తున్న వైద్యులు ఎన్‌ఎస్1, ఐజీజీ ఎలీసా పరీక్షలు చేస్తున్నారు. డెంగీ లేదని నిర్ధారించుకున్న తర్వాత చికున్‌గన్యాకు చికిత్స అందిస్తున్నారు. దీని ప్రభావం చిన్న పిల్లలపైనే ఎక్కువగా కనిపిస్తోంది.
- నిలోఫర్ ఆసుపత్రిలోని ఓపీకి ఈ తరహా కేసులు నిత్యం 5-6 వరకు వస్తున్నాయి. పిల్లల్లో సైతం కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి.
- చికున్ గన్యా బారినపడిన వారిలో కొత్తగా ముక్కు భాగంలో నల్లని ప్యాచ్‌లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. దీన్ని నిర్ధారించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం పీసీఆర్ టెస్టులు సైతం అందుబాటులో లేవు. లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తున్నారు.
- నగరంలో చికున్‌గన్యా కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు.
- జ్వరం తగ్గినా చాలామందిలో దాదాపు 3 నుంచి 4 వారాలపాటు తీవ్ర కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. ఇందుకు టైగర్ దోమ కారణం.
- చికున్‌గన్యా, డెంగీ వైరల్‌కు సంబంధించినవే. అయితే దీని వల్ల వచ్చే నొప్పులు తగ్గడానికి కొందరు పెయిన్‌కిల్లర్లు వాడుతున్నారు. వైద్యుల సూచనలు లేకుండా ఇలాంటివి చెయ్యొద్దని సూచిస్తున్నారు.
- తీవ్రమైన జర్వంతో శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నిస్సత్తువ ఆవహించదు.
చికున్‌గన్యా లక్షణాలు
- సడెన్‌గా 102 డిగ్రీలకుపైగా జ్వరం వస్తుంది.
- తీవ్ర కీళ్ల, కండరాల నొప్పులు వస్తాయి
- చేతుల మణికట్టు, కాళ్లు, మడమలు, భుజాల్లో నొప్పి ఉంటుంది.
- చర్మంపై దద్దుర్లే కాకుండా ముఖంపై నల్లటి ప్యాచ్‌లు వస్తాయి.
- జ్వరం తగ్గినా నెల రోజులపాటు కీళ్ల నొప్పులు ఉంటాయి.
- కొందరిలో ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి.
డెంగీ లక్షణాలు ఇలా
- హఠాత్తుగా 102 డిగ్రీలకుపైగా అధిక జ్వరం వస్తుంది.
- తీవ్రమైన తల, కళ్ల వెనుక నొప్పు ఉంటుంది.
- అలసట, వికారం, అతిసారం, వాంతులు చేసుకుంటారు.
- జర్వం వచ్చిన రెండు రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం
- ప్లాస్మా లీకేజీలు
- కాళ్లు, కళ్ల కింద వాపులు