ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ఓ ప్రధాన పార్టీ కోసం పోలీసు వాహనాల్లో డబ్బు రవాణా Phone Tapping Case Update :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. విచారణలో హవాలా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రజాప్రతినిధులతో పాటు పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపై ప్రణీత్ రావు ముఠా నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలి ఎన్నికల్లో కొన్ని పార్టీల నేతలు,(Political Leaders in Phone Tapping Case) సహచరులు, మద్దతుదారుల ఫోన్లపై నిఘా పెట్టి వారు తరలిస్తున్న డబ్బు పట్టుకున్నట్లు పోలీసులు అనుమానించారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు వారు మౌఖికంగా ఈ ఆరోపణలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు ఇచ్చిన నిఘా సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావు క్షేత్ర స్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బును పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.
నా ఫోన్ ట్యాప్ చేసి రూ.కోట్లు వసూలు చేశారు - రాధాకిషన్‌రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు - phone tapping case updates
Phone Tapping Case :ఇదే సమయంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బు పంపిణీలో మరొక అధికారి కీలకంగా వ్యవహరించడంతో పాటు పోలీసు వాహనాల్లోనే రాష్ట్రమంతా నిధులు రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు వాహనాల్లోనే పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో నిధులు రవాణా చేసినట్లు పోలీసులు తేల్చారు. విచారణ సందర్భంగా ఎవరెవరికి డబ్బు అందించామనే సమాచారం సైతం చెప్పినట్లు తెలుస్తోంది. నిర్ధారించుకునేందుకు డబ్బు అందుకున్నట్లు భావిస్తున్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.
ఇందులో మాజీ మంత్రుల (Phone Tapping political Crime) స్థాయి వారూ ఉన్నట్లు సమాచారం. న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతున్న దర్యాప్తు అధికారులు, నిందితుల వాంగ్మూలం ఆధారంగా అనుమానితులను విచారించేందుకు ఉన్న మార్గాలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు అంగీకరిస్తే, రెండు, మూడు రోజుల్లోనే నోటీసుల ప్రక్రియ ఆరంభమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితేఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) అంశం మరో స్థాయికి వెళ్తుందనడంలో సందేహం లేదు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక వికెట్ ఔట్ - టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్ట్ - TS Phone Tapping Case
మరో వ్యాపారి ఫిర్యాదు: ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా తనను బెదిరించారంటూ ఓ వ్యాపారి బంజారాహిల్స్ ఠాణాలో దర్యాప్తు బృందాన్ని కలిశారు. పలు ఆధారాలను సైతం దర్యాప్తు బృందానికి ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత కేసులోని నిందితుడొకరు తన ఫోన్ వాయిస్ రికార్డులను చూపించి మరీ బెదిరించారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రంలోని తన స్నేహితుడితో మాట్లాడిన వాయిస్ రికార్డులు, నిందితుడికి ఎలా వెళ్లాయో దర్యాప్తు జరపాలని కోరినట్లు సమాచారం. శాస్త్రీయ ఆధారాలు లభ్యమైతేఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బలమైన సాక్ష్యాలుగా మారే అవకాశాలున్నాయి.
'రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారు' - Telangana Phone Tapping Case Update