Phone Tapping Case Allegations on KCR Fir Filed : రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోన్న ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. తాజాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై అడ్వకేట్ అరుణ్‌కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ అసలు చాలా చిన్న విషయం అనే విధంగా మాట్లాడారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేసీఆర్‌పై ఫిర్యాదు నమోదు - Telangana Phone Tapping Case - TELANGANA PHONE TAPPING CASE
Phone Tapping Case Allegations on KCR : ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌పై అడ్వకేట్ అరుణ్ కుమార్ పంజాగుట్ట ఠాణాలో మరోసారి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా చిన్న విషయం అనే విధంగా మాట్లాడారని తెలిపారు. కేసీఆర్ హయాంలో చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని ఆరోపిస్తూ ఇదివరకే ఆయన, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు.
Phone Tapping Case Allegations on KCR
Published : Apr 27, 2024, 3:30 PM IST
మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్‌పై కూడా ఫిర్యాదు చేశారు. తాను సాక్షిగా కొన్ని ఛానళ్లలో మాట్లాడితే వాటికి లీగల్ నోటీసులు పంపి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గతనెల 08వ తేదీన ఫిర్యాదు చేసినప్పటికీ పంజాగుట్ట పోలీసులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సహా 39 మంది ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.