తెలంగాణ

telangana

సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​తో బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు : మహేశ్ కుమార్ గౌడ్ - PCC Chief Comments On BJP

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 2:13 PM IST

PCC Chief Mahesh Kumar Goud Comments On BJP : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంత‌రం జాతీయ పతాకావిష్కరణ చేశారు. హైదరాబాద్ ప్రజాపాల‌న‌లో విలీనమైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంద‌న్నారు.

Praja Palana Dinotsavam 2024
PCC Chief Mahesh Kumar Goud Comments On BJP (ETV Bharat)

PCC Chief Mahesh Kumar Goud Comments On BJP : సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​తో బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేద‌ని పీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో గానీ, హైదరాబాద్ విలీనంలో కానీ బీజేపీకి ఎలాంటి పాత్ర లేద‌న్న ఆయ‌న, అప్పటికి బీజేపీ పార్టీనే పుట్టలేద‌ని ఆరోపించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంత‌రం జాతీయ పతాకావిష్కరణ చేశారు.

హైదరాబాద్ ప్రజాపాల‌న‌లో విలీనమైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంద‌న్నారు. స్వాతంత్య్రానంతరం దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేయాలని నాటి కేంద్ర హోంమంత్రి, ఆయ‌న‌కు అత్యంత సన్నిహితులైన సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్‌ను కోరిన‌ట్లు తెలిపారు. సర్ధార్ వల్లభ్​భాయ్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి ప్రధాని నెహ్రూకు అత్యంత సన్నిహితుల‌ని పేర్కొన్నారు.

నేడు బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోంద‌ని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంద‌ని ఆరోపించారు. హైదరాబాద్ విలీనంలో ఎలాంటి పాత్రలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదని విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీల‌క‌మైన సోనియా గాంధీని, వారి కుటుంబాన్ని కించపరచడం బీఆర్ఎస్ పార్టీ నీతిమాలిన చర్యలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.

నేను ఫామ్​హౌస్​ ముఖ్యమంత్రిని కాదు - పనిచేసే ముఖ్యమంత్రిని : సీఎం రేవంత్​ రెడ్డి - Praja Palana Dinotsavam 2024

తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు : కిషన్ రెడ్డి - Telangana Liberation Day 2024

ABOUT THE AUTHOR

...view details