తెలంగాణ

telangana

ETV Bharat / state

'నీటిని భారీగా నిల్వ చేయడంతోనే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు' - PC GHOSH COMMISSION INQUIRY UPDATES - PC GHOSH COMMISSION INQUIRY UPDATES

PC Ghosh Commission Inquiry Update : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ జరుగుతున్న సమయంలోనే నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ ఇంజినీర్లు తెలిపారు. గురువారం పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన అధికారులు, ఇంజినీర్లు నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు.

PC Ghosh Commission Investigations Updates
PC Ghosh Commission Inquiry Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 9:37 PM IST

Updated : Sep 20, 2024, 9:48 PM IST

PC Ghosh Commission Investigations Updates : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ ఇంజినీర్లు కమిషన్​కు తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు శుక్రవారం తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది.

నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజినీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణం చేపట్టినట్లు తెలిపిన రీసెర్చ్ ఇంజినీర్లు, నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు వచ్చాయని వెల్లడించారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని తెలిపారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్​లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్న అధికారులు, బ్యారేజీల్లో సమస్యలు, మోడల్ స్టడీస్​కు సంబంధం లేదని వివరించారు.

సమాధానం ఇచ్చే విధానం సరికాదు : నిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు ఇంజినీర్లు వివరించారు. లొకేషన్, సీడీఓ అథారిటీ నివేదికల ఆధారంగా రీసెర్చ్ చేశామన్న అధికారులు, ఇంజినీర్లు మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు తెలిపారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు తనకు తెలియదని రీసెర్చ్ చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి సమాధానాలు ఇచ్చారు. ఈ మేరకు కమిషన్ ముందు సమాధానం ఇచ్చే విధానం సరికాదని జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. పని చేసిన సమయంలో ఏమీ గుర్తుకు ఉందో చెప్పాలని అన్నారు. చాలా విషయాలు తనకు గుర్తుకు లేదని, మర్చిపోయానని శ్రీదేవి తెలిపారు.

రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ నిబంధనలను పాటించిందా ? :కాళేశ్వరం ఆనకట్టల విషయంలో ఎన్డీఎస్ఏ నిబంధనలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పాటించిందా లేదా అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులను ప్రశ్నించింది. శుక్రవారం రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ సీఈ ప్రమీల, ఇంజినీర్లు, సీడీఓ ఇంజినీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఏ, ఇండియన్ డ్యాం సేఫ్టీ నిబంధనలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పాటిస్తుందా లేదా అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు.

కాళేశ్వరంపై చేసిన​ తీర్మానాలు ఇవ్వండి - రాష్ట్ర సర్కార్​ను కోరిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ - PC GHOSH COMMISSION INQUIRY UPDATE

ఇంజినీర్లను ప్రశ్నించిన జస్టిస్​ పీసీ ఘోష్ - 'కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల గురించి అడిగితే పొంతన లేని సమాధానాలు' - JUSTIC PC

Last Updated : Sep 20, 2024, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details