తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను మరచిపోవాల్సిందే : పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan On Rayalaseema

Pawan Kalyan on YCP Leaders Anarchies in Rayalaseema : రాయలసీమ ప్రాంతాన్ని జగన్ గుంపు నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని జనసేన ఆధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మరోసారి వైసీపీకి అధికారం ఇస్తే రాయలసీమ ప్రాంతాన్ని మర్చిపోవాల్సిందేనని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంతం కొంతమంది వ్యక్తుల చేతిలో బందీగా మారిపోయిందన్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.

Pawan Kalyan on YCP Leaders Anarchies in Rayalaseema
Pawan Kalyan

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 10:06 PM IST

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను మరచిపోవాల్సిందే !: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan on YCP Leaders Anarchies in Rayalaseema :రాయలసీమ ప్రాంతాన్ని జగన్ గుంపు నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని జనసేన ఆధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇవాళ పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇంకొకసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాంతాన్ని మరచిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్కడి ప్రజలు వేరే చోటికి వలస వెళ్లే పరిస్థితులు ఉంటాయని అన్నారు. చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో బందీగా ఉండి పోయిందని వ్యాఖ్యానించారు. కర్నూలులో సుగాలి ప్రీతి హత్య తర్వాత ఆమె తల్లి ఆహ్వానం మేరకు వెళ్లానని లక్షన్నర మంది తరలివచ్చి మద్ధతు తెలిపారని గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ - బీజేపీతో పొత్తు విషయం చర్చ?

రాయలసీమలో తాము చేపట్టిన నిరసనలకు జనం భారీగా వస్తున్నారని అయితే ఎన్నికల రోజు మాత్రం వైసీపీకి భయపడి ఓటు వేయడం లేదని వ్యాఖ్యానించారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న రాయలసీమను జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నిన్నటి వరకు తనకు సలహాలు ఇచ్చిన వారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారని పరోక్షంగా ముద్రగడను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. మా పార్టీ కార్యాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కొడితేనే దెబ్బ తగులుతుందా? మేం కొడితే తగలదా? అంటూ హెచ్చరించారు.

వైఎస్సార్సీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు : పవన్ కల్యాణ్​

బానిస సంకెళ్లతో ఎన్నాళ్లు ఉంటారో ఆలోచించాలి:వైసీపీ నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారని మా ఏరియాకు వస్తే ఊరుకోం అనేలా వైకాపా నేతల వైఖరి ఉందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ వైసీపీ వస్తే రాయలసీమ నుంచి వలసలు ఇంకా పెరుగుతాయని అన్నారు. రాయలసీమ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిపోతున్నారని అన్నారు.

బానిస సంకెళ్లతో ఎన్నాళ్లు ఉంటారో రాయలసీమ వాసులు ఆలోచించాలి. డబ్బు, కుటుంబం అన్నీ వదులుకుని ప్రజల బాగు కోసం వచ్చా, ఈసారి అణగారిన వర్గాలకు అండగా ఉంటా. చిన్న కులాల్లో ఐక్యత లేకే జగన్‌ మనుషులకు ఊడిగం చేస్తున్నారు. భయం వదిలేస్తేనే పరిస్థితులు మారుతాయి. వైసీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలి. జగన్‌లా చొక్కాలు మడతపెట్టను. అవన్నీ సినిమాల్లో చేసేశాను. -పవన్​కల్యాణ్​, జనసేన అధినేత

ప్రజారాజ్యం పార్టీ నుంచీ శ్రీనివాసులు నాకు తెలుసని అన్నారు. నాతో కలిసి ప్రయాణిస్తానని శ్రీనివాసులు చెప్పారని వారిని మసన్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

YCP MLA Arani Srinivasulu Joined Janasena:వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చిత్తూరు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రాయలసీమలో గెలిచిన ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యేను నేను అలాంటి నాకు కూడా టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చే జనసేనలోకి వచ్చానని తెలిపారు. చిత్తూరులో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చి వేస్తున్నారు తిరుపతిలో పేదల ఇళ్లను వైసీపీ నేతలు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్

ABOUT THE AUTHOR

...view details