Pawan Kalyan Mother Anjana Devi Interview : జనసేన అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తల్లి అంజనాదేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పవన్‌కల్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. చిన్నతనంలో పవన్ ఎలా ఉండేవారు.. రాజకీయపరమైన అంశాలపై అంజనాదేవి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఇంతకీ.. ఇంటర్ప్యూలో పవన్ కల్యాణ్ గురించి పవన్ మాతృమూర్తి ఎలాంటి విషయాలు పంచుకున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
సినీ కళామతల్లికి ముగ్గురు స్టార్స్‌ని ఇచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయ్యింది. మీరు దీన్ని ఎలా ఫీలవుతున్నారు?
"పవన్ ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అంత సుఖం వచ్చింది. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిందని" అన్నారు అంజనాదేవి.
జనసేన స్థాపించి 10 ఏళ్లు గడిచింది. సినీ కెరీర్‌ను పక్కన పెట్టి రాత్రింబవళ్లూ ప్రజల్లో ఉంటూ కష్టపడుతుంటే మీకు ఏమనిపించింది!
"అలా తిరుగుతుంటే ఒక మాతృమూర్తిగా బాధ కలిగింది. అయితే.. ఇంట్లో అయినా అలాగే ఉంటాడు. ఎక్కడైనా పడుకుంటాడు. షూటింగులు చేసి వచ్చి సోఫాలోనే నిద్రించేవాడు. ఎంత కష్టపడినా ‘ఇంత కష్టపడ్డాను’ అని ఏ రోజూ చెప్పేవాడు కాదు. చిన్నప్పటి నుంచీ ఏమీ అడిగేవాడు కాదు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. తినడానికి రమ్మని పిలిచినా త్వరగా వచ్చే వాడు. అది కావాలి.. ఇది కావాలి’ అని అడిగేవాడు కాదు. నేను చేసిన వంటల్లో పలావు చాలా ఇష్టంగా తినేవాడు" అని పవన్ మాతృమూర్తి చెప్పుకొచ్చారు.
తిరుమలలో యోగ నారసింహస్వామి టెంపుల్లోనే పవన్‌కు అన్నప్రాసన చేశారట!
"ఒకసారి మేము తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లాం. అప్పటికి కచ్చితంగా మా అబ్బాయికి ఆరో నెల వచ్చింది. అప్పుడు నాకు మనసులో అక్కడే అన్నప్రాసన చేద్దామని అనిపించింది. అయితే.. ఆ రోజుల్లో వెంకట్రావు(పవన్ తండ్రి) గారు పోలీసు అవడం వల్ల ఎప్పుడూ ఆయన దగ్గర చిన్న కత్తి ఉండేది. ఈ క్రమంలో అన్నప్రాసన చేసే టైమ్‌లో పవన్ కల్యాణ్ ముందు.. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం ఉంచితే ఆయన ముందు "కత్తి" పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు. కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికీ ఏదో చేస్తాడని అప్పుడే అనుకున్నానని" అన్నారు అంజనాదేవి.
పవన్‌పై ఆయన తండ్రి వెంకట్రావు ప్రభావం ఉండేదా?
చిన్నప్పటి నుంచి కల్యాణ్ వాళ్ల తండ్రితోనే ఎక్కువగా ఉండేవాడు. ఎక్కువగా మాట్లాడడు. మితభాషి. అందుకే వాళ్ల నాన్నకి పవన్ అంటే చాలా ఇష్టమన్నారు.
పవన్ కల్యాణ్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదివేవారా?