తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో దారుణం - కుమార్తెను చంపిన తల్లిదండ్రులు - Parents Killed Daughter - PARENTS KILLED DAUGHTER

Parents Killed Daughter : మాట వినడం లేదని సొంత కుమార్తెను తల్లిదండ్రులు హత్యచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమార్తెను హత్య చేసిన తల్లిందండ్రులు, ఇంటి పక్కనే ఉన్న గడ్డివామిలో పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Parents killed Daughter in Nellore District
Parents Killed Daughter (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 10:02 PM IST

Parents killed Daughter in Nellore District :ఆంధ్రప్రదేశ్​లోనెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లిపాలెంలో కన్నకుమార్తెను తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మాట వినడం లేదని కన్న కుమార్తెను తల్లిదండ్రులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటరమణయ్య, దేవసేనమ్మ అనే దంపతులకు కుమార్తె ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువతి మాట వినడం లేదని ఆమెను హత్యచేసి ఇంటి పక్కనే ఉన్న గడ్డివామిలో పాతి పెట్టినట్లు కొడవలూరు సీఐ సురేంద్రబాబు తెలిపారు.

యువతి 20 రోజుల నుంచి కనిపించక పోవడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా ఈ ఉదంతం బయటపడింది. తహసీల్దార్ సమక్షంలో ఆమె మృతదేహాన్ని వెలికితీసి, శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే హత్యకు గురైన ఆమెకు పెళ్లి అయినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి విషయంలో ఆమెకు, తల్లిదండ్రులకు గొడవలు జరిగేవని సమాచారం. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె కనిపించడం లేదని తెలుసుకున్న పోలీసులు, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా విషయం బయటపడింది.

బంధువులు ఏం అంటున్నారంటే : కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులు మందలిస్తుండగా తగలరానిచోట తగిలి యువతి మృతి చెందిందని బంధువులు తెలిపారు. ఈ విషయం బయటకు రానివ్వకుండా తల్లిదండ్రులు వెంకటరమణయ్య, దేవసేనమ్మలు కుమార్తె మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న గడ్డివామి వెనక గొయ్యితీసి పాతిపెట్టారని చెప్పారు.

"పల్లిపాలెం గ్రామంలో శ్రావణి అనే వివాహిత గత 20 రోజుల నుంచి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాపు చేశాం. తల్లిదండ్రులతో శ్రావణికి గత కొన్ని రోజులుగా పెళ్లి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమెను ఏమైనా చేసి ఉంటారు ఏమో అని విచారణ చేశాం. అయితే ఆ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులే వారి మాట వినట్లేదని ఆమెను హత్య చేసి, ఇంటి దగ్గర్లో ఉన్న గడ్డివాము దగ్గర పూడ్చి పెట్టారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎవరెవరు సహకరించారు అనే విషయాలను దర్యాప్తులో తెలుసుకుంటాం". - సురేంద్ర బాబు, కొడవలూరు సీఐ

మదనపల్లెలో ఘోరం - ప్రియుల మోజులో కన్న తండ్రినే కడతేర్చిన కసాయి కుమార్తె - Madanapalle Father Murder Incident

చెడు వ్యసనాలకు బానిసై - పెట్రోల్ పోసి, బండరాయితో మోది కన్న తండ్రిని మట్టుబెట్టిన కుమారుడు - Son Kill father

ABOUT THE AUTHOR

...view details