తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్కగానొక్క కొడుకుపై ఎన్నో ఆశలు - హిజ్రా ఎంట్రీతో మారిన సీన్ - PARENTS COMMIT SUICIDE IN NANDYAL

హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్న యువకుడు - కుమారుడిని మందలినప్పటికీ వినకపోవడంతో తల్లిదండ్రుల ఆత్మహత్య

Parents commit suicide in Nandyal
Parents commit suicide in Nandyal (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2024, 7:21 PM IST

Updated : Dec 25, 2024, 7:43 PM IST

Parents commit suicide in Nandyal :అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమారుడు హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఉన్నప్పటికీ పోస్టుమార్టం గదిలో అనాథ శవాల మాదిరిగా వారిని ఉన్న వారిని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాలలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెళ్లడించారు.

ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఏ కష్టమూ తెలియకుండా పెంచారు. ఆస్తులు లేకున్నప్పటికీ పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారుడిని ఇంజినీరింగ్​(బీటెక్​) దాకా చదివించారు. అతడికి చదువు అబ్బకపోవడంతో అతడి కోరిక మేరకు ఓ ఆటో కొనిచ్చారు. రోజూ ఆటో నడుపుతున్నటువంటి అతడి ఆలోచనలు, అభిరుచులను మాత్రం ఆ తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఆటో నడుపుతున్న క్రమంలోనే యువకుడికి హిజ్రాలతో ఏర్పడిన పరిచయం చెడు స్నేహానికి దారి తీసింది.

హిజ్రాలు తరచూ ఇంటికి రావడంతో :హిజ్రాలు తరచూ అతడి ఇంటికి కూడా రావడం ప్రారంభించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు ఇదేం పని అంటూ కుమారుడిని నిలదీశారు. అలాంటి చెడు అలవాట్లు మానుకోవాలని, పెళ్లి చేసుకుని తమకు ఆసరాగా ఉండాలని కుమారుడికి ఎంతో ప్రాథేయపడ్డారు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో కుమారుడికి పలుమార్లు వాగ్వాదం జరిగేది. కొన్నాళ్లుగా కుమారుడికి కౌన్సిలింగ్ ఇప్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా తనకు స్నేహితులే ముఖ్యమని కుమారుడు తేల్చిచెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలినంత పనైంది.

ఎవరికీ చెప్పుకొనలేక మరణమే శరణమని :ఎవరి కోసమైతే జీవితాన్ని ధారపోశామో, ఎవరి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నామో అతడే చీదరించుకోవడంతో అనుక్షణం ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నంతలో ఘనంగా వివాహం చేయాలని, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలనుకున్న వారి కలల కల్లలయ్యాయి. ఇవే ఆలోచనలతో తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యారు. తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక, ఎలా పరిష్కారమవుతుంతో తెలియక మరణమే ప్రత్యామ్నాయం అని చివరకు నిర్ణయించుకున్నారు.

"నంద్యాల పట్టణానికి చెందిన దంపతులు సుబ్బరాయుడు, సరస్వతి విషపూరితమైన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి కుమారుడు సునీల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సునీల్ హిజ్రాలతో సన్నిహితంగా ఉండడంతో అతడి తల్లిదండ్రులు మందలించారు. హిజ్రాతో స్నేహం మాని వివాహం చేసుకోవాలని చెప్పారు. అతను మాట వినకపోవడంతో తల్లిదండ్రులు కలత చెంది మూడు రోజుల కిందట గడ్డి మందు సేవించారు. వారిద్దరినీ కర్నూలు ఆసుపత్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు" -ఇస్మాయిల్, సీఐ

Last Updated : Dec 25, 2024, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details