Paddy Crop Damage in Warangal : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో వడగండ్ల వానతో అన్నదాతలకు అపార నష్టం కలిగింది. అకాల వర్షాలతో నల్లబెల్లి మండలంలోని మేడెపల్లి, రాంపూర్ గ్రామాలలో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మేడెపెల్లి, రాంపూర్ చెరువులతో పాటు రంగాయి చెరువు ఆయకట్టు కింద రైతులు వందలాది ఎకరాలలో వరి పంట సాగు చేశారు. అది కాస్త వడగండ్ల వానకు నేలకొరిగి గింజలు రాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్రంలో పలు చోట్ల వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Telangana
Heavy Rains in Warangal :అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టించిన రైతన్నకు రబి సాగుకు నీరందక దిగుబడులు తగ్గాయి. వచ్చిన కొద్దిపాటి దిగుబడిని అమ్ముకొని సొమ్ము చేసుకుందామని కోనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. కానీ నిన్న కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవ్వడంతో పాటు వరద ఉధృతికి రోడ్ల పైన పోసిన ధాన్యం డ్రైనేజీలో కొట్టుకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రైతులను వరణుడు నట్టేట ముంచుతున్నాడని తడిసిన ధాన్యాన్ని కేటాయించిన గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.