Osmania University Girls Hostel Incident: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా పీజీ కాలేజ్ సబ్‌క్యాంపస్ వసతి గృహం ఉలిక్కిపాటుకు గురైంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థినులు నిద్రిస్తున్న వేళ ముగ్గురు ఆగంతుకులు కత్తితో హాస్టల్‌లోకి చొరబడ్డారు. వసతి గృహం వెనక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న స్నానాల గదిలోకి వెళ్లారు. అదే సమయంలో అందులోకి వెళ్లిన ఓ యువతి గమనించి కేకలు(OU Girls Hostel Incident) వేసింది. అరుపులు విన్న హాస్టల్‌లోని విద్యార్థినులంతా నిద్రమేల్కొని అక్కడికి పరుగులు తీశారు. విద్యార్థినులంతా కలిసి సెక్యూరిటీ గార్డుల సాయంతో చున్నీతో ఓ వ్యక్తిని బంధించారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే విద్యార్థి సంఘాలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఓయూలో విద్యార్థుల ధర్నా- వీసీ రవీందర్ రాజీనామాకు డిమాండ్
Man Breaks Into Womens Hostel at OU : అర్ధరాత్రి వేళ ఆగంతకుల చొరబాటుతో హాస్టల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వసతి గృహానికి రక్షణ లేకపోవటం, అధికారుల నిర్లక్ష్యధోరణితోనే ఈ తరహా ఘటనలకు కారణమంటూ అర్ధరాత్రి హాస్టల్ ముందు విద్యార్థులు బైఠాయించారు. ఆందోళన చేస్తున్న వారికి విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. వీసీ వెంటనే హాస్టల్ వద్దకు వచ్చి, రక్షణ చర్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.
"రాత్రి 12 గంటలకు ఎవరో తెలియని వ్యక్తి హాస్టల్‌కి వచ్చాడు. వసతి గృహం పక్కన ఏర్పాటు చేస్తున్న దోభిఘాట్ను నిర్మిస్తున్న వ్యక్తుల దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఎలా రావచ్చు, దొరికిపోతే ఎలా పారిపోవాలో మొత్తం మ్యాప్ వాళ్ల దగ్గర ఉంది. మేము చూసి సెక్యూరిటీకి చెబితే వాళ్లు వచ్చారు. సెక్యూరిటీ సాయంతో వాళ్లను పట్టుకున్నాం. మరో ఇద్దరు పారిపోయారు. మాకు ఎంత భయం ఉంటే అర్ధరాత్రి నుంచి హాస్టల్ బయట కూర్చుంటాం. ఎలాంటి సౌకర్యాలు లేని ఇలాంటి హాస్టల్లో ఎందుకు మమ్మల్ని పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం."- విద్యార్థిని
Farewell to OU CI Ramesh : ఓయూ సీఐకి విద్యార్థుల ఘన వీడ్కోలు.. పలువురి భావోద్వేగం