Online Investment Frauds Telangana :కొంత పెట్టుబడి పెట్టండి వందరోజుల పాటు రూపాయలు 50 చొప్పున లాభాలిస్తాం. కొంతకాలం లాభాలు ఇచ్చి పెట్టుబడి పెట్టిన వారిని నమ్మించి ఆ తర్వాత 24 వేలకు పెడితే నాలుగు వేలు ఇస్తామంటూ ఇలా సాధారణ ప్రజలు మోసపోయారంటే ఆశ్చర్యం వేయదు కానీ, పోలీసులే నిండా మునిగారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మి హైదరాబాద్‌కి చెందిన కొంత మంది పోలీస్‌లు సుమారు 75 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. తీరా మోసపోయామని బయట తెలిస్తే పరువు పోతుందని తెలిసి కక్కలేక మింగలేకపోయారు.
Telangana Cyber Crimes : ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రోజువారీగా లాభాలు ఇస్తామంటూ గత నవంబరులో విస్తృతంగా ప్రచారం సాగింది. వేరేవారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసుశాఖ ఉద్యోగి ఒకరు టెలిగ్రామ్ యాప్‌లోని గ్రూపులో చేరాడు. ఆ గ్రూపు రెండు, మూడేళ్ల నుంచి కొనసాగుతోందని చాలా మంది సభ్యులు ఉన్నట్లు నిర్థారించుకున్న ఉద్యోగి పెట్టుబడి పెట్టేందుకు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఒక్కసారి 1,500 పెడితే 100 రోజులపాటు రోజూ 50 చొప్పున చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు చెప్పారు. నమ్మిన ఉద్యోగి 1,500 పంపాడు. నిందితులు రోజూ 50 చొప్పున జమ చేశారు. నిజంగా లాభాలు రావడంతో నగరంలో తనతో పాటు పనిచేసే సహచరులకు చెప్పాడు.
98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్
తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్లు స్కెచ్: అతడిని నమ్మిన సుమారు 100 మంది ప్రాథమికంగా కొన్ని పెట్టుబడులు మొదలు పెట్టారు. నేరగాళ్లు తొలుత యాప్‌లో లాభాలు జమచేసేవారు. అంతా నమ్ముతున్నట్లు భావించిన నిందితులు మరోమోసం మొదలు పెట్టారు. 24 వేలు జమ చేస్తే రోజుకు 4 వేల చొప్పున ఇస్తామని చెప్పగా పెట్టుబడి జమచేశారు. తొలి రెండు మూడు రోజులు లాభాలు పంపగా నిజమేనని భావించిన ఉద్యోగులు ఒక్కొక్కరు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. కొందరు 50 వేలు 75 వేల వరకు పంపారు. ఆ విధంగా సుమారు వంద మందికి పైగా కలిసి మొత్తం 75 లక్షలకుపైనే పెట్టుబడి పెట్టారు.