తెలంగాణ

telangana

ETV Bharat / state

సూరారం ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం - కార్మికుడు మృతి - మరో ముగ్గురికి తీవ్రగాయాలు - FIRE ACCIDENT IN PHARMA COMPANY

ఆరోరా ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం - ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

FIRE ACCIDENT IN PHARMA COMPANY
Fire accident in Pharma Company in Suraram (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 2:27 PM IST

Updated : Nov 20, 2024, 4:52 PM IST

Fire accident in Pharma Company in Suraram: హైదరాబాద్​ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరోరా ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ అవ్వడంతో అనిల్ (43) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటన విషయం బయటకు రాకుండా రహస్యంగా క్షతగాత్రులను యశోదా ఆసుపత్రికి తరలించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫార్మా కంపెనీ నడుపుతున్న ఆరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఫార్మా కంపెనీ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వలేదని పోలీసులు మండిపడ్డారు.

Last Updated : Nov 20, 2024, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details