ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైన్​షాపు దగ్గర దొరికే చికెన్ పకోడీ ఇదేనంట! - గుట్టు తెలిస్తే మత్తు దిగాల్సిందే!

కోళ్ల వ్యర్థాలకు మసాలా దట్టించిన వైనం - 700కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

700kg_spoiled_chicken_in_secunderabad
700kg_spoiled_chicken_in_secunderabad (ETV Bharat)

Food Safety Officials Seized 700 Kg Spoiled Chicken In Secunderabad : తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో 700కిలోల కుళ్లిన చికెన్‌ను ఆహార భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చికెన్ షాప్​లో వ్యర్థాలు (కాళ్లు, తలకాయలు, స్కిన్, కొవ్వు) పదార్థాలను నిల్వ ఉంచి మద్యం దుకాణాలు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్న దుకాణాన్ని ఆహార భద్రత టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్​లోని బేగంపేట, ప్రకాశ్‌ నగర్‌లో ఓ దుకాణాదారుడు చికెన్​ను ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో పెట్టి విక్రయిస్తున్నాడు. అంతే కాకుండా నిల్వ ఉంచిన చికెన్‌ను మద్యం దుకాణాలకు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నిబంధనలను విరుద్ధంగా అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. గత కొన్నాళ్లుగా గోదాంలో కోడి కొవ్వు, కాళ్లు, ఎముకలను ఫిజ్‌లో నిల్వ ఉంచి కొనుగోలుదారులు విక్రయిస్తున్నారని తెలిపారు. కోడిలోని వ్యర్థపదార్థాలను ఎక్కువకాలం నిల్వ ఉంచి వాటిని అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి చికెన్‌లోని విడుదల పదార్థాలను విక్రయిస్తున్నట్లు తమ దృష్టి వచ్చిందని, ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details