Hyderabad Non-Veg Shops close:నాన్ వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సండే వచ్చిందంటే చాలు దాదాపు అందరి ఇళ్లలో నాన్‌వెజ్ వంటలు ఘుమఘమలాడుతుంటాయి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అంటూ నచ్చిన వాటిని తెచ్చుకుని ఫ్యామిలీతో కలిసి తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఆ రోజున షాపుల ముందు క్యూ సంగతి చెప్పక్కర్లేదు. మాంసం కోసం ఉదయం నుంచి షాపుల వద్ద బారులు తీరుతారు. అంత ఇష్టం నాన్‌వెజ్ అంటే. అలాంటి నాన్‌వెజ్ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. అది ఏంటంటే ఈ ఆదివారం(ఏప్రిల్ 21) రోజున హైదరాబాద్ నగరంలో ఎక్కడా కూడా నాన్‌వెజ్ దొరకదు! ఎందుకంటే ఆ రోజున చికెన్, మటన్ షాపులన్నీ క్లోజ్ ఉండనున్నాయి. అసలు ఈ ఆదివారం రోజున నాన్‌వెజ్ షాపులను ఎందుకు మూసివేస్తున్నారో మీకు తెలుసా ? ఇప్పుడు తెలుసుకుందాం..
కారణం ఇదే!:సిటీలో ఆదివారం రోజున నాన్‌వెజ్ అమ్మకాలు ఉండకపోవడానికి కారణం.. ఆ రోజున జైనుల మహావీర్ జయంతి పండుగ ఉండటమే. అయితే, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అన్ని కబేళాలతో పాటు మాంసం అమ్మే దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ఆదేశాల ప్రకారం ఆదివారం రోజున ఎవరూ కూడా మాంసం విక్రయాలు జరపకూడదని తెలిపారు. కాబట్టి, ఆదివారం రోజున నగరంలో ఎక్కడా కూడా నాన్‌వెజ్ షాపులు ఓపెన్‌గా ఉండవు.