NMMS Scholarship Exam Update : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సువర్ణవకాశం. ఈ పది రోజులు కష్టపడితే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ అందుకునే అవకాశం ఉంటుంది. 4 ఏళ్లు స్టేషనరీ, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది. కేంద ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎన్ఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న స్టూడెంట్స్కు పది రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. గత ప్రశ్నపత్రాలు(ప్రీవియస్ పేపర్లు సాధన చేయించాలని సూచించారు.
ఉన్నత విద్యకు తోడ్పాటు :గవర్నమెంట్ పాఠశాలల్లో 8 వ తరగతి చదివే విద్యార్థుల కోసం ప్రతి ఏటా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష నిర్వహిస్తుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు, వసతి లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు మాత్రమే రాసేందుకు అర్హులు. ఈ స్కాలర్షిప్నకు రాత పరీక్ష విధానంలో ఎంపిక చేస్తారు. ఇప్పటికే 2 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ నెల 24న పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా స్టూడెంట్స్ను ఎంపిక చేస్తారు.
ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం : ఎన్‌ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) కింద ఎంపికైన స్టూడెంట్కు ఏడాదికి రూ.12 వేల స్కాలర్షిప్ చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు రూ.48 వేలు నేరుగా విద్యార్థి బ్యాంకు అకౌంట్లో జమవుతాయి. 2017 వరకు ఏడాదికి 6 వేల రూపాయలు మాత్రమే చెల్లించేవారు. 2018 నుంచి ఈ స్కాలర్ షిప్ను రూ.12 వేలకు పెంచారు.
180 మార్కులకు పరీక్ష :ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో మెంటల్ ఎబిలిటీకీ 90 మార్కులు కేటాయించారు. రీజనింగ్ తదితర ప్రశ్నలను విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి రాస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను పొందవచ్చు.