NIMS Giving Free Gene mutation tests in Hyderabad : జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి మార్పులు, కొన్ని రకాల క్రిమిసంహారకాలు సహా అనేక రకాలైన అంశాలు క్యాన్సర్‌కి దారి తీస్తుంటాయి. ఒక్కసారి ఈ మహమ్మారి బారిన పడితే మానసికంగా, శారీరకంగానే కాదు ఆర్థికంగా కుంగిపోవాల్సిన దుస్థితి. సాధారణంగా క్యాన్సర్‌కు కీమో, రేడియో థెరపీ చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్‌లకు శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. కీమో, రేడియో థెరపీల వల్ల క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యంగా ఉన్న కణాలకూ నష్టం కలుగుతుంది. అధిక మొత్తంలో ఇచ్చే ఔషధాలు రోగులపై దుష్ప్రభావాలు చూపుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే 'పర్సనలైజ్డ్ మెడిసిన్'. క్యాన్సర్ రోగిలో జీన్ మ్యుటేషన్లను గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స అందిస్తారు. ఇందుకోసం రోగిలో మ్యుటేషన్లను గుర్తించేందుకు మాలిక్యులార్ జెనెటికి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
NIMS Providing free Cancer Tests: పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే నిర్వహించే జీన్ మ్యుటేషన్ల పరీక్షలు అత్యంత ఖరీదైనవి కావటంతో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రీసెర్చ్ విభాగం ఐసీఎంఆర్‌తో కలిసి డైమండ్స్ ప్రాజెక్టు చేపట్టింది. దేశవ్యాప్తంగా 12 చోట్ల ఈ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించి ఈజీఎఫ్ఆర్, ఏఎల్కే, ఆర్ ఓఎస్-1, రొమ్ము క్యాన్సర్‌కి సంబంధించి ఈఆర్ పీఆర్, హెచ్ ఇఆర్-2 వంటి టెస్టులు అందుబాటులో ఉన్నాయి.
ప్రమాదకర క్యాన్సర్‌కు మందు!- టీకా క్లినికల్ ట్రయిల్స్ సక్సెస్!! - MELANOMA Cancer VACCINE