NHRC Serious on ABVP Student Jhansi Incident : ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటిలో ఏబీవీపీ విద్యార్ధి సంఘం నేత ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) వివరణ కోరింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సహా నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఏబీవీపీ నిరసనలో పోలీసుల ఓవరాక్షన్ - మహిళ కార్యకర్త జుట్టుపట్టుకొని
హైకోర్టు కోసం యూనివర్సిటీ భూమిని కేటాయిస్తూ తెచ్చిన జోవోను రద్దు చేయాలని గత కొంత కాలంగా వర్సిటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. కాగా ఈ నెల 25 వారికి మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం అక్కడకు వెళ్లింది. నిరసన తెలుపుతున్న క్రమంలో ఉద్రిక్తత చోటు చేసకుంది. అందోళన కారులను నిలువరించే క్రమంలో ఝాన్సీ అనే ఏబీవీపీ నేతను ద్విచక్ర వాహనంపై వెంబడించారు.
స్కూటీపై వెనుక కూర్చుని ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆమె జుట్టును పట్టుకోగా ఒక్కసారిగా ఝాన్సీ(ABVP Jhansi Incident) కింద పడిపోయింది. ఈ వీడియో మీడియాతో పాటు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. మీడియా కథనాలు ఆధారంగా సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. కాగా ఘటనకు కారణమైన రాజేంద్ర నగర్ ఠాణాలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ఇప్పటికే సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు.
ABVP Leaders Complaints Governer :స్టూడెంట్ లీడర్ ఝాన్సీపై పోలీసుల దాడి ఘటన దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది. పలువురు బీజేపీ నేతలు పోలీసుల తీరును ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ఏబీవీపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. అమానవీయంగా దాడి చేసిన పోలీసు అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బాధితురాలు ఝాన్సీ కూడా ఉన్నారు. ఫిర్యాదును పరిశీలించిన గవర్నర్.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
ఏబీవీపీ స్టూడెంట్ లీడర్‌పై దాడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటో- సీఎస్, డీజీపీకి నోటీసులు 'JEE చదవలేను, అమ్మా, నాన్న క్షమించండి'- కోటాలో మరో విద్యార్థి సూసైడ్