New Advisors Telangana 2024 : అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులు, కష్టకాలంలో అండగా నిలిచిన నలుగురు సీనియర్ నేతలు వేం నరేందర్ రెడ్డి, హర్కర్ వేణుగోపాల్, మల్లు రవి, షబ్బీర్ అలీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక పదవుల్లో నియమించారు. ముఖ్యమంత్రి ప్రజావ్యవహారాల సలహాదారుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో కలిసి పని చేశారు. 16 ఏళ్లుగా వారిద్దరి స్నేహబంధం కొనసాగుతోంది. 2004 నుంచి 2009 వరకు వేం నరేందర్‌రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉండగా, 2007లో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టి చురుకైన నాయకుడిగా వ్యవహరిస్తూ వచ్చారు.
Congress leaders Wish to Advisors :2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబాబాద్ రిజర్వుడ్ స్థానం కావడంతో వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా యత్నించారు. 2017లో వారిద్దరు కాంగ్రెస్‌లో( TS Govt Advisors) చేరారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత వేం నరేందర్ రెడ్డిని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వెంట నడిచిన ఆయన, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు మంత్రి హోదా కల్పిస్తూ సలహాదారుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోతుంది : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
CM Revanth Reddy Advisor : మరో సలహాదారు హర్కర్ వేణుగోపాల్ రావు ప్రొటోకాల్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి అత్యంత సన్నిహితుడు. 2018 ఎన్నికల్లో హర్కర్ వేణుగోపాల్ రావుకు టికెట్ ఇవ్వలేకపోయిన అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రొటోకాల్ ఛైర్మన్‌గా జాతీయ నాయకులు, ఇతర నాయకులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన సేవలు గుర్తించి ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుగా సీఎం నియమించారు. పీసీసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న మల్లు రవిని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది.