NDRF Special Training Indian Red Cross Society Staff :ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించటంపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వైద్యం, సామాజిక సేవలందించే రెడ్‌క్రాస్ సభ్యులు విపత్తుల సమయంలో అందించే సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. ఎక్కడైనా అనుకోని ప్రకృతి విపత్తులు సంభవిస్తే వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి బాధితులను రక్షించే మెళకువలు నేర్చుకుంటున్నారు. ఈ శిక్షణను అన్ని ప్రాంతాల్లో అందించే విధంగా త్వరలో చర్యలు తీసుకుంటామని రెడ్‌క్రాస్ ప్రతినిధులు చెబుతున్నారు.
వైద్యం, రక్తదానం, సామాజిక సేవలందించే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ఓ అడుగు ముందుకు వేశారు. విపత్తుల సమయంలో బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలో శిక్షణ తీసుకుంటున్నారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులకు NDRF సిబ్బంది ప్రత్యేక శిక్షణనిస్తున్నారు.
భవనాలు కూలినప్పుడు, వరదల్లో గ్రామాలు మునిగి నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించే సహాయ చర్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వివరించారు. అనంతరం కృష్ణా నదిలో స్పీడ్ బోట్లపై మాక్‌డ్రిల్‌తో క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనేది డెమో చేసి చూపించారు. విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలకు గురైనపుడు గుండె ఆగిపోతే సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు ఏవిధంగా రక్షించాలో శిక్షణనిచ్చారు.- ప్రదీప్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్