ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూట్యూబర్‌ హర్షసాయిపై యువతి ఫిర్యాదు - అత్యాచారం కేసు నమోదు - Case Against YouTuber Harsha Sai - CASE AGAINST YOUTUBER HARSHA SAI

Case Against YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Case Against YouTuber Harsha Sai
Case Against YouTuber Harsha Sai (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 7:22 AM IST

YouTuber Harsha Sai Case :నేటికాలంలో సోషల్​ మీడియా హవా అంతా ఇంతా కాదు. సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న వీడియోలు అప్​లోడ్ చేస్తూ ఫేమస్​ అయిన వ్యక్తులు చాలా మంది. వారిలో ముఖ్యంగా ఎక్కువమంది వీక్షించే యూట్యూబ్​లో పేరు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. అలా యూట్యూబర్​లు ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా ట్రెండ్ సెట్టర్​గా మారుతున్నారు. ప్రస్తుత కాలంలోని జనరేషన్​ కూడా వారినే ఫాలో అవుతున్నారు.

అలాంటి వారిలో హర్షసాయి ఒకరు. యూట్యూబర్​గా అందరికి సుపరిచమని చెప్పవచ్చు. పేదలకు ఆర్థిక సాయం చేసి ఆ వీడియోలను తన ఛానెల్​లో అప్​లోడ్ చేస్తుంటాడు. ఇలా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రియేటివ్​గా రీల్స్, షార్ట్స్​తో బాగా పాపులర్ అయ్యాడు. ఎంతలా అంటే తనకంటూ ఓ ఫాలోయింగ్​ని ఏర్పరచుకున్నాడు. సోషల్ మీడియాలో ఇన్​ఫ్లూయెన్సర్​ ​​గాను మారాడు. అలా టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతనిపై అత్యాచారం కేసు నమోదు కావడం కలకలం రేపింది.

ఇందుకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూట్యూబర్‌ హర్షసాయిపై రేప్​ కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన సదరు యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చింది. ఒక రియాల్టీ షోలో పాల్గొంది. ఒక ప్రైవేట్ పార్టీలో హర్షసాయి కలిశాడని పేర్కొంది. స్నేహంగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Harsha Sai Rape Case Updates : బాధితురాలిని పోలీసులు కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. హర్షసాయి తండ్రిపైనా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన హర్షసాయి పేదలకు ఆర్థిక సాయం చేస్తూ ఆ వీడియోలు తన ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. అతను హీరోగా బాధిత యువతి హీరోయిన్‌గా గతంలో ఒక సినిమాను ప్రారంభించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

అత్యాచారం కేసులో యూట్యూబ్ స్టార్ చంద్రశేఖర్ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details