ETV Bharat / politics

విజయసాయిరెడ్డి గుప్పిట్లో సాగరతీరం - అరాచకాలు, అక్రమాలతో అలజడి - VIJAYASAI REDDY IRREGULARITIES AP

విశాఖలో డిఫ్యాక్టో సీఎం అనేలా చెలరేగిపోయిన విజయసాయిరెడ్డి - ఆర్థిక అరాచకాలతో సాగరతీరంలో అలజడి సృష్టి

Vijayasai Reddy Irregularities in AP
Vijayasai Reddy Irregularities in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 9:28 AM IST

Vijayasai Reddy Irregularities AP : వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ ఆర్థిక అక్రమాలకు కొమ్ముకాసి పార్టీలోనూ నంబర్‌-2గా విజయసాయిరెడ్డి ఎదిగారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖలో పూర్తిస్థాయిలో తిష్ఠ వేశారు. విశాఖలో ఆయనే డిఫ్యాక్టో సీఎం అనేలా చెలరేగిపోయారు. తన ఆర్థిక అరాచకాలతో సాగరతీరంలో అలజడి సృష్టించారు. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ వంటి కీలక పోస్టుల్లో వైఎస్సార్సీపీతో అంటకాగే అధికారుల్ని నియమించుకుని, వారి అండతో విపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగారు.

టీడీపీ నేతల భవనాల్ని కూలగొట్టించడం, ఆస్తుల విధ్వంసం, భూముల కబ్జాల వంటి అరాచకాలకు పాల్పడ్డారు. శని, ఆదివారాలు వస్తే ఎవరి భవనాలపైకి బుల్డోజర్లు, పొక్లెయిన్లు పంపుతారో అనేంత భయానక పరిస్థితులను సృష్టించారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగుల బదిలీలు మొదలు, రాజకీయ నియామకాలు, స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వంటివన్నీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి.

విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు విజయసాయిరెడ్డి అనేక నీచాలకు పాల్పడ్డారని విపక్షాలు విమర్శించాయి. టీడీపీలోని కీలక నేతల్ని వైఎస్సార్సీపీ చేర్చుకునేందుకు విశ్వప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. మాట వినకపోతే ఆర్థిక మూలాలపై దెబ్బకొడతామని బెదిరించి మరీ కొందర్ని ఆ పార్టీలో చేర్చుకున్నారని చెబుతారు. విశాఖ అభివృద్ధికి ప్రగతిభారతి ట్రస్టు పేరుతో పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారుల్ని బెదిరించి విరాళాల పేరుతో కోట్లు వసూలు చేశారని విమర్శలున్నాయి. ఆ డబ్బులతో ఏం సేవా కార్యక్రమాలు చేశారో, ట్రస్ట్‌ ఎక్కడికి పోయిందో తెలియదు.

కబ్జాలకు కేరాఫ్‌ అడ్రస్‌ : విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తామన్న ముసుగులో వైఎస్సార్సీపీ నేతలు అక్కడ చేసిన ప్రతి దందా, వందల కోట్ల విలువైన భూకబ్జాల వెనుక మాస్టర్‌ మైండ్‌ విజయసాయిరెడ్డిదేనని తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయన బంధువులు, బినామీలు భారీగా ఆస్తులు కూడగట్టారు. రుషికొండలో రేడియంట్‌ సంస్థకు 2005లో వైఎస్‌ ప్రభుత్వం కేటాయించిన వెయ్యి కోట్ల విలువైన భూములు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకుల పరమయ్యాయి.

మధురవాడలో ఎన్‌సీసీ సంస్థకు చెందిన సుమారు రూ.1500 కోట్ల విలువైన భూమిని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడి సంస్థ దక్కించుకుంది. తీరానికి సమీపంలో కొండపై బేపార్క్‌ పేరుతో నిర్మించిన వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రాజెక్టు వైఎస్సార్సీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోయింది. విశాఖ - భీమిలి బీచ్‌రోడ్డులో రామానాయుడు స్టూడియోస్‌ భూముల్లోనూ వాటా కొట్టేశారు. కైలాసగిరికి సమీపంలో గతంలో కార్తికవనం పేరిట కేటాయించిన భూముల్లో నిర్మించిన స్టార్‌హోటల్‌ ఆ పార్టీ పెద్దల సన్నిహితుల పరమైంది. వీటన్నింటి వెనుక సూత్రధారి, కీలకపాత్రధారి విజయసాయిరెడ్డేనని విశాఖ అంతా కోడైకూసింది.

విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఆనుకుని అత్యంత విలువైన 87,714 చదరపు గజాల స్థలాల్ని కొనుగోలు చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పట్లో వాటి విలువ రూ.53 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో అంతకు ఎన్నో ఎక్కువ రెట్లు ఉంటుంది. కొందర్ని బెదిరించి భూములు విక్రయించేలా చేశారన్న ఆరోపణలున్నాయి. భీమిలిలో నాలుగు సర్వే నంబర్ల పరిధిలోని మూడున్నర ఎకరాల స్థలాన్ని అవ్యాన్‌ రియల్టర్స్‌ పేరిట కొని, నిర్మాణాలు చేపట్టారు.

భారీగా భూముల కొనుగోలు : కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి, సముద్ర తీరానికి కేవలం 30 గజాల దూరంలో కాంక్రీట్‌తో గోడ కట్టేశారు. ఇసుక తిన్నెల్ని జేసీబీలతో తొలగించి, నిర్మాణాలకు అనువుగా గ్రావెల్‌తో పూడ్చేశారు. అక్కడ తన కుమార్తె పేరిట విలాసవంతమైన హోటల్‌ నిర్మించాలన్నది విజయసాయిరెడ్డి ప్రణాళికని సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ వస్త్రవ్యాపారి పేరు మీద భోగాపురం పరిధిలో భారీగా భూములు కొన్నారు.

భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి ఇరువైపులా భూములు కొని, వాటిని ఆనుకుని వెళ్లేలా ప్రతిపాదిత రహదారిని వంకర్లు తిప్పారని, కేవలం ఆయన ఆస్తులకు విలువ పెంచడానికే పాత ఎలైన్‌మెంట్‌ మార్చారన్న ఆరోపణలున్నాయి. మధురవాడలో శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో 5067 చదరపు గజాల స్థలాన్ని అవ్యాన్‌ సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకుని, దానిలో కుమార్తె కోసం విల్లా నిర్మాణం చేపట్టారు. ఆ స్థలం నజరానాగా దక్కిందన్న ఆరోపణలున్నాయి.

విశాఖ నడిబొడ్డున దసపల్లా భూముల్లో అందుబాటులో ఉన్న దాదాపు రూ.2000ల కోట్ల విలువైన 15 ఎకరాల స్వాధీనానికి విజయసాయిరెడ్డి చక్రం తిప్పారు. జిల్లా కలెక్టర్‌తో ప్రభుత్వానికి లేఖ రాయించి, నిషిద్ధ భూముల జాబితా నుంచి దసపల్లా స్థలాలను తొలగించేలా పావులు కదిపారు. ఆ తర్వాత రాణి కమలాదేవి నుంచి భూములు కొన్నట్లు తెరపైకి వచ్చిన 64 మంది నుంచి ఎష్యూర్‌ సంస్థ పేరిట డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారని ఆరోపణలున్నాయి. ఆ సంస్థకు నిధులన్నీ విజయసాయి అల్లుడి కంపెనీ అవ్యాన్‌యే సమకూర్చిందంటారు.

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌తోనూ బంతాట : ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌తోనూ విజయసాయిరెడ్డి బంతాట ఆడుకున్నారు. తన అల్లుడి అన్న, దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డిని రెండు పర్యాయాలు ఏసీఏ అధ్యక్షుడిగా నియమించారు. ఉపాధ్యక్షుడిగా అల్లుడు రోహిత్‌రెడ్డిని, కార్యదర్శిగా తనకు అత్యంత సన్నిహితుడైన వస్త్ర వ్యాపారి గోపీనాథ్‌రెడ్డిని నియమించారు. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏ ప్రధాన కార్యాలయాన్ని జగన్‌ మెప్పు కోసం విశాఖకు మార్చేశారు.

వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌నూ సినిమా పరిశ్రమతో సంబంధం లేని తన అనుచరగణానికి విజయసాయిరెడ్డి కట్టబెట్టారు. అప్పటి వరకు ఒకటే కమిటీ ఉండగా శాశ్వత, మేనేజ్‌మెంట్‌ కమిటీల పేరుతో రెండింటిని సృష్టించారు. శాశ్వత కమిటీ ఛైర్మన్‌గా జగన్‌ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సాగి దుర్గాప్రసాద్‌రాజును నియమించారు. అనకాపల్లి జిల్లా బయ్యవరం వివాదాస్పద భూముల్లో విజయసాయి అనుచరుడు గోపీనాథ్‌రెడ్డి 56 ఎకరాలు కొని, లేఅవుట్‌ వేశారు.

విశాఖలో సాయిరెడ్డి జనవాణి పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఎక్కడెక్కడ విలువైన భూములున్నాయో తెలుసుకుని, సెటిల్‌మెంట్లు చేశారన్న ఆరోపణలున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న వాల్తేరు క్లబ్బుపైనా కన్నేసి, ఆ క్లబ్బు సభ్యుల్ని ముప్పతిప్పలు పెట్టారన్న విమర్శలొచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు, సెజ్‌ భూముల్ని బలవంతంగా తన అల్లుడికి చెందిన అరబిందో కంపెనీకి కట్టబెట్టిన వ్యవహారంలోనూ విజయసాయిరెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని బాధితుడు చెప్పారు.

వైఎస్సార్సీపీ గుప్పిట్లో సాగర తీరం - నిబంధనలకు పాతరేస్తూ అక్రమ నిర్మాణాలు - YSRCP Irregularities Visakhapatnam

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు - Vijayasai Daughter Place issue

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.