Nara Chandrababu Naidu Made Key Comments: గెలుపు ఎన్డీఏదే, అందులో ఎవరికీ అనుమానం లేదని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తెలిపారు. మోదీకి అండగా ఉంటామని చెప్పేందుకే ప్రజలు తరలివచ్చారన్నారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో తెలుగుదేశం - జనసేన- బీజేపీ ప్రజాగళం (Praja Galam) బహిరంగ సభలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజాగళం సభ, రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా అని వెల్లడించారు. ఐదేళ్లుగా విధ్వంస, అహంకార పాలన చూశామని, ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించేందుకే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు తెలిపారు. మీరు ఇచ్చిన తీర్పే మీ జీవితాలను నిర్ణయిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Comments ON NDA : ప్రజల ఆశీర్వాదాలు ఎన్డీఏకు(NDA GOVT) ఇవ్వాలని చంద్రబాబు కోరారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ నినాదమని చంద్రబాబు తెలిపారు. మోదీ ఒక వ్యక్తి కాదు, భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి అని కొనియాడారు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి అని తెలిపారు. మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మవిశ్వాసమని చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమ పథకాలకు (Welfare Schemes) కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ అని కొనియాడారు.
చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి ముగ్గురు అగ్రనేతలు
Chandrababu Comments ON Modi :అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు పేర్కొన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మోదీ నినాదాలని చంద్రబాబు తెలిపారు. జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే అని వెల్లడించారు. వికసిత్ భారత్ దిశగా మన దేశం దూసుకుపోతోందన్నారు. పేదరికం లేని దేశం అనేది మోదీకల అని, ఆయన ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సరైన సమయంలో దేశానికి మోదీ లాంటి నేత వచ్చారన్నారు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మోదీ అని చంద్రబాబు కొనియాడారు. భారత్‌ను శక్తిమంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు.