తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు - నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలన్న కోర్టు - Actor Nagarjuna Defamation Suit

మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ - పిటిషనర్ నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

NAGARJUNA DEFAMATION SUIT UPDATES
Actor Nagarjuna Defamation Suit (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 2:10 PM IST

Actor Nagarjuna Defamation Suit : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం నాడు పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.

ABOUT THE AUTHOR

...view details