Allu Arjun Bail Plea Adjourned :సినీ నటుడు అల్లు అర్జున్ బెయిట్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్ కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరగా నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పుష్ప సినిమా బెనిఫిట్ షో రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతల బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన వర్చువల్‌గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
అల్లు అర్జున్‌పై కేసు వెనక్కి తీసుకుంటాను : శ్రీతేజ్ తండ్రి భాస్కర్