Easy Tips Cooking Mutton Properly : చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. నాన్‌వెజ్ వంటకం ఏదైనా సరే వండాలంటే కూరగాయలతో పోలిస్తే అంతా ఈజీ కాదు. మటన్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుక్కర్లో పెట్టి ఎన్ని విజిల్స్ వచ్చినా.. తీసి చూస్తే ముక్క ఇంకా గట్టిగానే ఉంటుంది. కొన్ని సింపుల్ టెక్నిక్ పాటిస్తే మటన్‌ని ఈజీగా ఉడికించవచ్చు. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అవెంటో తెలుసుకుందామా?
రాక్ సాల్ట్ :
మాంసం కడిగిన నీళ్లు మొత్తం పోయేలా బాగా వడకట్టాలి. ఆపై ఆ మటన్‌లో కొద్దిగా రాక్ సాల్ట్ (మామూలు ఉప్పు కాదు రాళ్ల ఉప్పు) వేసి బాగా కలిపి ఒక గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన రెగ్యులర్ పద్దతిలోనే వండుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది
టీ :
మటన్‌ని వండే ముందే టీ డికాషన్ (చక్కెర వేయకూడదు) వడబోసి, దాన్ని మనం ముందే కడుక్కుని ఉంటుకుని మటన్‌లో పోసి ఒక గంటపాటు అలా పక్కకు పెట్టుకోవాలి. ఇలా కూడా మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది. టీలో ఉండే ట్యానిన్లు మటన్‌ని త్వరగా, మెత్తగా ఉడికేలా చేస్తాయి.
వెనిగర్ లేదా నిమ్మరసం :
వెనిగర్ లేదంటే నిమ్మ రసం కూడా మటన్ త్వరగా ఉడికేందుకు ఉపయోగపడుతాయి. ఇవి యాసిడ్ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి మటన్‌ని త్వరగా ఉడికేందుకు తోడ్పడంతో పాటు కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది.
టమాటాలు :
టమాటాల్లోనూ యాసిడ్ గుణం ఉంటుంది. వీటిని పేస్ట్ చేసి వేసినా లేదంటే టమాటా సాస్ వేసిన మనకు రిజల్ట్ వస్తుంది. తెలంగాణలో ఎక్కువమంది నాన్‌వెజ్‌లో టమాటా వాడటం కామన్ అయితే వీళ్లంతా టమాటాని డైరెక్టుగా ముక్కలు కోసి కర్రీలో వేసేస్తారు. మరికొంతమంది సాస్ వేస్తారు. కర్రీ ఉడికిన తర్వాత చివర్లో ఎక్కువమంది వేస్తూ ఉంటారు. కాకపోతే తాళింపు వేసినప్పుడే వీటిని వేసుకోవడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది.