Musi Riverfront Beautification Project : మూసీ నదిలో రోడ్డు, మెట్రో, బోటింగ్ సౌకర్యాలు మెట్రోలో పాతిక కిలోమీటర్ల దాకా భూ మార్గం. ఆహా, వినడానికి ఎంతో బావుందో కదా! అవును నిజమే. హైదరాబాద్ వాసులకు నూతన అనుభూతిని ఇవ్వడానికి కాంగ్రెస్(Congress) సర్కారు ఇలాంటి ఆలోచనలే చేస్తోంది. రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూసీ నదిలో ప్రయాణించవచ్చు. హైదరాబాద్ మధ్యలోంచి వెళ్లే మూసీ నది ఆధునీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం ఆహ్వానించింది. మూసీ ఆధునీకరణతో నగరం నలుమూలలా అభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నారు.
అన్ని రాష్ట్రాల చూపు హైదరాబాద్ వైపే - మూసీని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
Congress Focus On MusiBeautification :మూసీ నదీ కారిడార్ వెంట రోడ్ కమ్ మెట్రోరైలు మార్గం ఏర్పాటుచేయాలనేది సర్కారు ఆలోచన. ఇందులో భాగంగా నది వెంట మెట్రోరైలు నిర్మాణానికి రూ.9వేల కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా మెట్రో రైలు అధికారులు అంచనా వేశారు. 55 కి.మీ. దూరంలో 25 కిలోమీటర్ల వరకు ఎట్ గ్రేడ్(భూ మార్గం)గా వెళ్లేందుకు అవకాశముందని ప్రభుత్వానికి తెలిపారు. అధ్యయనం చేసిన తర్వాతే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుందంటున్నారు. హైదరాబాద్‌లో నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్ నుంచి మొదలు బాపూఘాట్, హైకోర్టు, చాదర్‌ఘాట్, నాగోలు వైపు నుంచి తూర్పు హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ను ప్రతిపాదిస్తున్నారు.
భాగ్యనగరంలో మూసీ మురికి వదిలించేదెలా? - కలుషిత నీటి నుంచి మంచినీటిగా మారేదెప్పుడు?
నగరంలోనుంచి దాటేలా
Road-Cum-Metrorail Route Along Musi River Corridor :అవుటర్ రింగ్ రోడ్డు ఒకవైపు నుంచి రెండోవైపు రావాలంటే దాదాపు 80 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అదే పట్టణం లోపలి నుంచి రహదారి ఉంటే రాకపోకల దూరం తగ్గుతుందని కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. మూసీని సుందరీకరించడంతో పాటు రహదారి నిర్మాణం ఉంటుంది. ఈ మేరకు మెట్రో రైలు మార్గం నిర్మించాలనేది సర్కారు ఆలోచన. ఈ మార్గంలో, నాగోల్ తర్వాత కొంత దూరం భూమార్గం మీదుగా మెట్రో తీసుకెళ్లవచ్చు అనే ఆలోచనను హెచ్‌ఎంఆర్ ప్రభుత్వం ముందుంచింది. ఎత్తుగా ఉన్న చోట ఈ తరహాలో ఏర్పాటు చేయవచ్చు అనే సూచనలు చేసింది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న మార్గాలను అధ్యయనం చేస్తోంది.
పర్యాటకం.! ప్రయాణమూ.!
మూసీ వెంట రహదారి, మెట్రోతో పాటు నదీ గర్భంలో ఎల్లవేళలా నీరు ఉండేలా చేసి బోటు ప్రయాణం నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇటీవల ఒక సమావేశంలో వెల్లడించారు. కృష్ణా, గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించి అక్కడి నుంచి మూసీలోకి నీటిని వదిలి శుభ్రం చేస్తారు. అక్కడక్కడ ఎత్తుపల్లాలు పరిశీలించి అనువైన చోట ఐదు కిలోమీటర్లకు ఒక చెక్‌డ్యామ్ ఏర్పటుతో ఏడాదంతా నీరుండేలా చూస్తారు. ఇందులో పర్యాటక బోటింగ్‌తో పాటు రవాణాను ప్రోత్సహిస్తారు. ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు బోటులో రాకపోకలు సాగించవచ్చు.
మురికిమయంగా మారిన మూసీ నది - ప్రక్షాళన ఎంతవరకు వచ్చింది?
KTR Review on Musi Development Project : మూసీ పరిధిలో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు..