తెలంగాణ

telangana

ETV Bharat / state

మాతృమూర్తి మమకారం - దివ్యాంగ కుమారుడి భవిష్యత్తుకు శ్రీకారం - mother take Disable son for Exam

Mother Takes her Handicapped Son For Tenth Exams : ఓ తల్లి దివ్యాంగుడైన తన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి పడుతున్న తపన స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కుమారుడిని ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దడానికి నానా కష్టాలు పడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బిడ్డ కోసం తల్లి పడే కష్టం, కష్టమే కాదు అన్నట్లు తన కుమారుడి విజయాల కోసం మూలస్తంభంగా ఉంటోంది ఈమె. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈ ఘటన నిర్మల్​ జిల్లాలో జరిగింది.

mother take Disable son for Exam
Mother Takes her Handicapped Son For Tenth Exams

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 5:35 PM IST

Updated : Mar 19, 2024, 6:30 PM IST

Mother Takes her Handicapped Son For Tenth Exams : బిడ్డ కోసం తల్లి పడే కష్టాలు మాటల్లో చెప్పలేం. ఎంత కష్టమైనా శ్రమించి ఇష్టంగా చేస్తుంటారు. అది కష్టంగా భావించకుండా పిల్లల విజయ మార్గాలకు ప్రతీక అన్నట్లుగా చూస్తారు తల్లిదండ్రులు. ఆ దిశగా ఓ తల్లి దివ్యాంగుడైన తన కుమారుడి కోసం శ్రమిస్తూ బంగారు భవిష్యత్తు అందించడానికి బాటలు వేస్తోంది. కుమారుడిని ప్రయోజకుడిగా చేయాలనే తపన, ఉన్నత చదువులు చదివించాలనే ఆరాటం, ఆ తల్లి ఎంతటి కష్టానికైనా వెనుకాడదని చెప్పడానికి ఇదే నిదర్శనం.

దివ్యాంగుడైన తన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్​కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. అయినా చదువు కొనసాగించాడు. 15 నెలల ప్రాయంలోనే చరణ్(Charan) తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి తల్లి పద్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తూ అమ్మ, నాన్నలతో కలిసి ఉంటున్నారు. తాత సహకారంతో బాలుడు పాఠశాలకు వెళ్లేవాడు. ప్రస్తుతం తాత వయసు సహకరించడం లేదు. దీంతో పద్మ తన కుమారుడిని నిర్మల్​లోని పరీక్ష కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. చేతులపై ఎత్తుకుని కేంద్రంలోకి తీసుకెళ్లారు. దివ్యాంగులకు కేటాయించిన స్క్రైబ్ విద్యార్థి సహకారంతో చరణ్ పరీక్ష రాస్తున్నాడు.

Last Updated : Mar 19, 2024, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details