Mother Commits Suicide on Birthday in Front of Child :పుట్టిన రోజునాడు కుమారుడి కళ్ల ముందు తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్లో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గంబీర్పూర్కు చెందిన సాగర్ రెడ్డి, రవళి దంపతులు. వీరికి మూడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు.
సాగర్ రెడ్డి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, సిద్దిపేటలో ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలను, తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. ఇలా వారి జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతోంది. కుమారుడు, కోడలు ఇద్దరు అన్యోన్యత చూసి సాగర్ రెడ్డి తల్లిదండ్రులు సంతోషపడేవారు. సాగర్ రెడ్డి ఉద్యోగానికి వెళితే భార్య, తల్లి పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారు. శుక్రవారం రోజున రవళి పుట్టినరోజు. ఉదయం అంతా బాగానే ఉన్నారు. సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు జరపాలని అనుకున్నారు. కాసేపటికి ఆమె భర్త ఉద్యోగానికి, మామ బయటకు వెళ్లారు. అత్త పుట్టినరోజు వేడుకకు కావాల్సిన సామగ్రి కోసం దుబ్బాకకు వెళ్లింది.
ప్రేమ విఫలమైందని ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య - ప్రియురాలు ఏం చేసిందంటే