Mother and Son Murder in Mahabubabad :చంద్రయాన్ లాంటి అద్భుతాలు మానవుడిని గర్వంగా నిలబెడుతున్నా, చేతబడిలాంటి నమ్మకాలు మాత్రం తలదించుకునేలా చేస్తున్నాయి. ప్రపంచాన్నే మార్చేసే పరిజ్ఞానం వచ్చినా, కొన్ని గ్రామాల్లో మాత్రం నేటికీ అజ్ఞానానిదే పైచేయిగా నిలుస్తోంది. కృత్రిమ మేథస్సుతో రోబోలను తయారు చేస్తున్న మనిషే, మూఢనమ్మకాల మాయతో మృగాల్లా మారుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి తల్లి బిడ్డను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
గత కొన్ని సంవత్సరాలుగా రెండు కుటుంబాల మధ్య మంత్రాల నెపంతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య రాజీ కోసం గూడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పంచాయతీ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడటంతో ఆటోలో తల్లీ సమ్మక్క, కుమారుడు సమ్మయ్య తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోను అడ్డగించి కుమారస్వామి అనే వ్యక్తి వారిని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఈ క్రమంలో స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A man Murdered for Practicing Black Magic :ఇదికాగా మరోచోట కూడా మూఢనమ్మకాలు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో గొర్ల కాపరిని సొంత కుమారుడు, తమ్ముడు చంపారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో దహనం చేసేందుకు ప్రయత్నించి పారిపోయారు. నిందితులను సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన నిమ్మ భూమయ్య, నిమ్మ కనకయ్య అన్నదమ్ముళ్లు.