Monkeys Died After Falling Into the Drinking Water Tank :నల్గొండ జిల్లానాగార్జున సాగర్ హిల్ కాలనీలోని ఓ మంచి నీటి ట్యాంకులో సుమారు 30 (Monkeys Died) పడి చనిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నీటి ట్యాంకులో వానరాలు పడి చనిపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నందికొండ మున్సిపాలిటీ ఒకటో వార్డు పరిధిలోని హిల్ కాలనీ విజయ విహార్ సమీపంలో సుమారు రెండు వందల నివాస గృహాల కోసం తాగునీటి అవసరాల నిమిత్తం ఎన్నెస్పీ నీటి సరఫరా విభాగం ట్యాంకును నిర్మించింది. ఈ ట్యాంకు నుంచే ఆ నివాస సముదాయాలకు రోజూ నీటిని సరఫరా (Water Tank Monkeys Died) చేస్తారు. దాహం తీర్చుకోవటానికి ఈ ట్యాంకు వద్దకు కోతుల గుంపు వచ్చింది. నీటి ట్యాంకుపై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో నీటి కోసం కోతులు లోపలికి దిగాయి.
30 Monkeys Died Falling Into Water Tank :మళ్లీ బయటకు రావడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో అందులోనే ఉండిపోయి మృత్యువాతపడ్డాయి. బుధవారం ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, నీటి ట్యాంకులో కోతుల మృత కళేబరాలు ఉండటం చూసి అవాక్కయ్యారు. సుమారు 30 కోతులను బయటకు తీశారు. చుట్టుపక్కల ఉన్న కోతులు ఎగబడటంతో వాటిని లోపల నుంచి తీయడం కొంచెం కష్టంగా మారిందని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. అనంతరం నీటిని మొత్తం బయటకు విడుదల చేసి నీటి ట్యాంకును పూర్తిగా శుభ్రం చేశారు.
మృతదేహం వద్ద బోరున ఏడ్చిన కోతి.. 20 గంటలు పాటు అక్కడే ఉండి..
కోతులు నీటి ట్యాంకులో మృతి చెందాయని తెలియక ఆ నీటినే తాగామని, అనారోగ్యానికి ఏమైనా గురవుతామోనని కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిరోజు తాగునీటి ట్యాంకును శుభ్రం చేయాల్సిన మున్సిపల్ సిబ్బంది, బాధ్యత లేకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు కూడా నీటి ట్యాంకును శుభ్రం చేసిన దాఖలాలు లేవని స్థానికులు మండిపడ్డారు.
నీటి ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే జైవీర్ : నీటి ట్యాంకులో వానరాలు పడి మృత్యువాత పడిన ఘటనా స్థలానికి ఎమ్మెల్యే జై వీర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ వేరువేరుగా వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే జైవీర్ మాట్లాడారు. మూగ జీవాలు నీటి కోసం ట్యాంకులో పడి మృత్యువాత పడడం చాలా దురదృష్టకరమైన అంశం అన్నారు. ఈ చిన్న నీటి ట్యాంకు స్థానంలో కొత్త నీటి ట్యాంకు నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ విషయంపై సాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు సమాచారం.
ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత : కోతులు నీటి ట్యాంకులో మృతి చెందిన అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఇది కచ్చితంగా మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన విషయమని ధ్వజమెత్తారు. ఈ సంఘటనతో ప్రభుత్వం తాగునీటి ట్యాంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోందని అర్థమవుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కోతుల గుంపు మధ్య ఘర్షణ.. కారణం తెలిస్తే షాక్
MONKEYS: వనం వదిలి జనంలోకి వస్తున్నాయ్.. ఇల్లు పీకి పందిరేస్తున్నాయ్..!